రాముడికి మొక్కుదాం బీజేపీని తొక్కుదాం :కేటీఆర్

Date:

Share post:

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్‌లో నిర్వహించిన చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాముడికి మొక్కుదాం బీజేపీ ని తొక్కుదాం అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలకు కేటీఆర్ (KTR Comments on BJP) పిలుపునిచ్చారు. దేవుడిని అడ్డం పెట్టుకొని బీజేపీ పార్టీ రాజకీయం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు.

తెలంగాణ లో బీజేపీ అభ్యర్థులు కరువయ్యారని… బీజేపీ ప్రకటించిన అభ్యర్థులలో చాల మంది తమ పార్టీ నించి వెళ్లిన వారే అంటూ కేటీఆర్ ఎద్దెవా చేశారు. ఒక్క సికిందరాబాద్ నుంచి పోటీ చేస్తున్న కిషన్ రెడ్డి ఒక్కరే అసలైన బీజేపీ అభ్యర్థి అని ఆయన తెలిపారు. దేశంలో మోదీ హ‌వా అంత బాగుంటే.. ఇత‌ర పార్టీల నుంచి నాయ‌కుల‌ను ఎందుకు తీసుకున్నారో చెప్పాలి అని కేటీఆర్ ప్రశ్నించారు.

‘మాట్లాడితే రాముడికి దండం పెడుదాం.. మోదీకి ఓటు వేద్దాం’ అని అంటున్నారు. హిందువులం కాబ‌ట్టి త‌ప్ప‌కుండా రాముడికి దండం పెడుతాం.. కానీ ఓటు వేసే ముందు చేవెళ్ల‌కు బీజేపీ ఏం చేసిందో ఆలోచించాలి అని కేటీఆర్ తెలిపారు.

ఇకపోతే నాలుగు నెలలైనా కేసీఆర్‌ను తిట్టుడు తప్ప రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదు. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే ఆయన మాట్లాడుతున్నడు అని కేటీఆర్‌ విమర్శించారు. అంతేకాకుండా పార్లమెంట్‌ ఎన్నికల అనంతరం బీజేపీలోకి జంప్‌ అయ్యే మొట్టమొదటి వ్యక్తి రేవంత్‌రెడ్డే అని కేటీఆర్ స్పష్టం చేశారు.

రాముడికి మొక్కుదాం బీజేపీని…. (KTR Comments on BJP):

ALSO READ: బీఆర్ఎస్ పార్టీకి కడియం శ్రీహ‌రి ద్రోహం చేశారు: హరీష్ రావు

Newsletter Signup

Related articles

Group 2 postponed: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షను వాయిదా (Telangana TGPSC Group 2 Exam Postponed)...

కాంగ్రెస్ లో చేరిన పఠాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే

బీఆర్​ఎస్​ పార్టీకి మరోసారి ఊహించని షాక్ తగిలింది. పఠాన్ చెరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు...

బీఆర్ఎస్ కు షాక్… కాంగ్రెస్ లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు

బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల గురువారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి (Six...

ఏపీ మంత్రివర్గం ఖరారు… జాబితా ఇదే

ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గం ఖరారు అయ్యింది. 24 మందితో మంత్రుల జాబితా (AP Cabinet Ministers List Released) విడుదల. బుధవారం ఉదయం...

మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ… ముహూర్తం ఫిక్స్

2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వంపై ఉన్న ఉత్కంఠకు తెరపడింది. భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టడం...

ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా

భారత ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా (PM Narendra Modi Resigns President...

AP Elections 2024: ఏపీలో కూటమి భారి విజయం

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ -జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం (AP Election 2024 results) సాధించింది. మొత్తం 164 స్థానాలలో కూటమి గెలుపు...

కాంగ్రెస్ కు షాక్… బీజేపీలో చేరిన పెద్దపల్లి ఎంపీ

తెలంగాణ: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన...

సీఎం జగన్ పై షర్మిల ఫైర్

ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌ వైఎస్ ష‌ర్మిల‌, సీఎం జగన్ పై (YS Sharmila Fires on CM Jagan) మండిపడ్డారు. పులివెందుల‌లో...

Vamsha Tilak: బీజేపీ కంటోన్మెంట్ అభ్యర్ధిగా డాక్టర్ వంశ తిలక్

తెలంగాణ: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ టి.ఎన్ వంశ తిలక్  (Secunderabad Cantonment BJP MLA Candidate...

వైసీపీకి షాక్… కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే చిట్టిబాబు

ఏపీ: రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరవుతున్న తరుణంలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు వైసీపీ పార్టీకీ రాజీనామా (Kondeti Chittibabu...

కొంగుచాచి అడుగుతున్నాం… మాకు న్యాయం చేయండి- షర్మిల

కడపజిల్లా పులివెందులలోని పూల అంగళ్లు సెంటర్‌లో నిర్వహించిన సభలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (Sharmila Pulivendula Public Meeting-Election Campaign) సంచలన...