కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్ (కోడి కత్తి శ్రీను)కు ఏపీ హైకోర్ట్ బెయిల్ మంజూరు చేసింది (AP High Court Grants Bail to Janapalli Srinivas (Kodi Kathi Srinu)). అయితే ఈ కేసుకు సంబంధించిన ఎలాంటి విషయాలను బహిరంగంగా మీడియాతో మాట్లాడద్దని కోర్టు ఆదేశించింది. అలాగే ర్యాలీల లోను, సభల్లోను పాల్గొనవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
సీఎం జగన్… ప్రతిపక్ష నేతగా ఉండగా 2018 అక్టోబర్ 25న ఆయనపై కోడికత్తితో దాడి జరిగిన విషయం అందరికి తెలిసినదే. విశాఖ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటనలో కేసులో జనిపల్లి శ్రీనివాస్‌ను పోలీసుల అరెస్టు చేశారు.
అయితే ఈ కేసులో (Kodi Kathi Case) బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితుడు ఎన్‌ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. అయినా ఊరట లభించలేదు. చివరికి ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను బెయిల్ మంజూరు చేసింది.
కోడి కత్తి శ్రీనుకు బెయిల్ (Janapalli Srinivas (Kodi Kathi Srinu) gets Bail):
దళిత బిడ్డ కోడి కత్తి శ్రీను కు బెయిల్ రావడం హర్షణీయం …
" సత్యమేవ జయతే "
— Ramesh Naidu Nagothu/రమేష్ /रमेश नायडू (@RNagothu) February 8, 2024
ALSO READ: దేనికి సిద్ధం జగన్ సార్? : వైఎస్ షర్మిల