ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో పార్టీలలో చేరికలు జోరు అందుకున్నాయి. ఈ క్రమంలో ఇవాళ భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో (Ambati Rayudu joins YSRCP) చేరడం జరిగింది.
గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ పార్టీ కండువా కప్పి అంబటి రాయుడు ని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మరియు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాల్గొనడం జరిగింది.
అయితే క్రికెటర్ గా తన కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రాయడు ఇప్పుడు రాయకీయ రంగంలో తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. పార్టీలో చేరిన అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై అంబటి విమర్శలు చేశారు. సీఎం జగన్ గత నాలుగున్నరేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలపై చాలా ఆరోపణలు చేసినవారు… ఇప్పుడు వారే అంతకంటే ఎక్కువ ఇస్తామని ఎలా చెప్తారని ప్రశ్నించారు.
వైసీపీలోకి అంబటి రాయుడు (Ambati Rayudu joins YSRCP):
#AndhraPradesh: Former Cricketer @RayuduAmbati formally joins @YSRCParty in presence of Chief Minister @ysjagan. pic.twitter.com/nwsQgvspJV
— @Coreena Enet Suares (@CoreenaSuares2) December 28, 2023