Balakrishna Whistle in AP Assembly: ఆంధ్రలో అసెంబ్లీ సమావేశాలు వేడెక్కాయి. రెండవరోజు అసెంబ్లీ సమావేశంలో తెలుగు దేశం పార్టీ హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేష్టలు ఇప్పుడు చేర్చనీయాంసంగా మారాయి. అయితే బాలకృష్ణ అసెంబ్లీ సమావేశం జరుగుతున్న సమయంలో చంద్రబాబు సీటుపైకి ఎక్కి విజిల్ వేస్తూ వైసీపీ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా బాలకృష్ణ విజిల్ వేస్తున్నట్లు కొన్ని వీడియోలు ఇప్పుడు ట్విట్టర్ లో హల్చల్ చేస్తున్నాయి.
అయితే బాలకృష్ణ తీరు పై వై.ఎస్.ఆర్.సీ.పి సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు. చంద్రబాబు సీటుపైకి ఎక్కడం ఎందుకు, ఆ సీట్లో కూర్చోవాలని అన్నారు. అంతేకాకుండా తన తండ్రిని చంపిన బావ కళ్లలో ఆనందం చూసేందుకు బాలకృష్ణ ప్రయత్నిస్తున్నారని అంబటి విమర్శించారు. ఎన్నికల తర్వాత ఇంటికి వెళ్లి విజిల్ ఊదుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు.
ఇదిలా ఉండగా గురువారం జరిగిన తొలిరోజు అసెంబ్లీ సమావేశంలో చంద్రబాబు అరెస్టు పై మాట్లాడాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు ప్లకార్డులతో స్పీకర్ చైర్ ను చుట్టుముట్టారు. అయితే ఇదే సమయంలో తెలుగు దేశం పార్టీ హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మీసం తిప్పారంటు కొంతమంది వై.ఎస్.ఆర్.సీ.పి ఎమ్మెల్యేలు ఆరోపణలు చేశారు. కాగా బాలకృష్ణ తీరుపై అక్కడికక్కడే స్పందించారు వై.ఎస్.ఆర్.సీ.పి సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు.
మీసాలు తిప్పడం సరైన పద్ధతి కాదని… ఇలాంటి పనులు ఏమైనా ఉంటే సినిమాల్లో చేసుకోమని అసెంబ్లీలో కాదని అంబటి తెలిపారు.
ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ విజిల్ (Balakrishna Whistle):
సభలో రెచ్చిపోతూ టిడిపి సభ్యుల గొంతు నొక్కుతున్న వైసీపీ సైకోలపై, విజిల్స్ వేస్తూ నిరసన తెలుపుతున్న టిడిపి ఎమ్మెల్యేలు #AndhraPradesh #NalugellaNarakam #JaganLosingIn2024#ByeByeJaganIn2024 #PsychoPovaliCycleRavali #JaganPaniAyipoyindhi #JaganFailedCM #PsychoJagan… pic.twitter.com/5BRk63tLSA
— Telugu Desam Party (@JaiTDP) September 22, 2023
బాలకృష్ణకు ఇదే మంచి అవకాశం.. చంద్రబాబు సీటు ఎక్కి నిలబడడం ఎందుకు.. ఆయన సీట్లోనే కూర్చోవచ్చు కదా? టీడీపీ ఎమ్మెల్యేలు సభను ఆటంకపరిచే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారు. వారికి చర్చలో పాల్గొనే దమ్ములేదని అర్థమైంది.
– మంత్రి అంబటి రాంబాబు#TDPGoonsInAssembly#APAssembly#TDPRowdies… pic.twitter.com/gOQK45fCz4
— YSR Congress Party (@YSRCParty) September 22, 2023
.@JaiTDP MLA #NBK N Balakrishna brings a whistle to #AndhraPradesh Assembly and blows it to court action against him. @ncbn @naralokesh @YSRCParty @AmbatiRambabu @RojaSelvamaniRK @ysjagan @AndhraPradeshCM pic.twitter.com/IPU9sollij
— Saye Sekhar Angara (@sayesekhar) September 22, 2023
#Balakrishna brought a whistle to the assembly
Down Down Balakrishna Slogans From YCP MLAs #APAssembly #APAssemblySessions #NandamuriBalakrishna #tupaki pic.twitter.com/o9UCC82InJ
— Tupaki (@tupakinews_) September 22, 2023
ALSO READ: అసెంబ్లీలో మీసం తిప్పిన బాలయ్య…! స్పీకర్ వార్నింగ్