కడపజిల్లా పులివెందులలోని పూల అంగళ్లు సెంటర్‌లో నిర్వహించిన సభలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (Sharmila Pulivendula Public Meeting-Election Campaign) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సభలో వైస్ షామిలి తో పాటు వైఎస్ వివేకానంద కుమార్తె వైఎస్ సునీత మరియు తదితరులు పేర్కొన్నారు. హంతకుడు చట్టసభలలోకి వెళ్లొద్దనే నేను కడప నుంచి పోటీ చేస్తున్నా.. మీ ఆడ బిడ్డలం అడుగుతున్నాం. మాకు న్యాయం చేయండి అని షర్మిల అన్నారు. వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
రానున్న ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న విషయం తెలిసినదే. అయితే అదే కడప నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిన్న కడప పులివెందులలోని జరిగిన సభలో షర్మిల మాట్లాడారు. జగన్ అన్న కోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసానని… వైఎస్ఆర్ సంక్షేమ పాలన వస్తుందనుకుని ఇళ్ళు వాకిలి వదిలేసి తిరిగా. జగన్ అన్న ఏది చెప్తే అది చేశా అంటూ షర్మిల అన్నారు.
ఇకపోతే వైఎస్ వివేకానంద గత్య పట్ల షర్మిల స్పందించారు. వివేకా హత్య విషయంలో సునీత, చిన్నమ్మ బాగా నష్టపోయారు అని షర్మిల చెప్పుకొచ్చారు. వివేకా అంటే స్వయానా మాకు చిన్నాన్న అని… రాముడికి లక్ష్మణుడు ఎలాగో.. వైఎస్‌ఆర్‌కు వివేకా అలాగ అని ఆమె తెలిపారు.
సొంత రక్త సంబంధానికి న్యాయం చేయకపోతే మనం ఎందుకు? ఐదు ఏళ్లు హంతకులను కాపాడారు. మళ్లీ వారికే సీటు ఇచ్చారు.హంతకుడు చట్టసభల్లోకి వెళ్లొద్దనే కడప నుంచి పోటీ చేస్తున్నా అని షర్మిల స్పష్టం చేశారు.
మాకు న్యాయం చేయండి (YS Sharmila Pulivendula Public Meeting):
మీ ఆడ బిడ్డలం.. కొంగుచాచి అడుగుతున్నాం. పులివెందుల ప్రజలారా.. మాకు న్యాయం చేయండి. జగన్ అన్న కోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. అన్న కోసం ఇళ్ళు వాకిలి వదిలేసి తిరిగా. జగన్ అన్న సీఎం అయితే వైఎస్ఆర్ సంక్షేమ పాలన వస్తుందనుకున్నా. జగన్ అన్న ఏది చెప్తే అది చేశా. వివేకా హత్య విషయంలో… pic.twitter.com/3pTZvnqny0
— YS Sharmila (@realyssharmila) April 12, 2024
కడపజిల్లా పులివెందులలోని పూల అంగళ్లు సెంటర్‌లో నిర్వహించిన సభకు భారీగా తరలివచ్చిన నా పులివెందుల ప్రజలకు,కార్యకర్తలకు, అభిమానులకు,నాయకులకు హృదయ పూర్వక కృతఙ్ఞతలు. పులివెందులకు మేం వస్తున్నామని తెలిసి లైట్లు తీశారు. లైట్లు అసలు ఉండవంటే సీఎంగా జగన్ ఫెయిల్ అయినట్టు. లైట్లు కావాలని… pic.twitter.com/HRTGxoj9QY
— YS Sharmila (@realyssharmila) April 12, 2024
ALSO READ: కాంగ్రెస్ లో చేరిన కిల్లి కృపారాణి