ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర అవుతున్న వేళా రాజకీయ పార్టీలలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల వై ఎస్ ఆర్ టి పి అధినేత్రి వై ఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయగా… నిన్న మధ్యాహ్నం వై ఎస్ షర్మిలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా నియమిస్తున్నట్లు (YS Sharmila Appointed as AP PCC Chief) ఆదేశాలు జారీ అయ్యాయి.
ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో రానున్న ఎన్నికల్లో ఏపీ రాజకీయాల్లో అన్నాచెల్లెలి మధ్య పోటీ ఖరారు అన్నట్లుగానే కనిపిస్తోంది. ప్రస్తుంతం ఈ వార్త రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చ నీయాంసంగా మారింది.
అయితే నిన్నటి వరకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించిన గిడుగు రుద్రరాజు ప్రమోషన్ దక్కింది. ఆయనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చోటు సంపాదించికున్నట్లు సమాచారం.
ఏపీ కాంగ్రెస్ చీఫ్ (YS Sharmila Appointed as AP PCC Chief):
Congratulations to Smt. @realyssharmila garu on being appointed as the new President of the @INC_Andhra
I hope you will contribute to making the Congress party stronger, similar to the way late YS Rajasekhara Reddy Garu did in 1999 and 2004..With hope 🇮🇳.#YSSharmila pic.twitter.com/IGmOWUWpfd
— Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) January 16, 2024
ALSO READ: విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని