WCW 2023 IND VS SL: భారత్ చేతిలో లంక చిత్తు

Date:

Share post:

WCW 2023 Ind Vs SL: వన్ డే వరల్డ్ కప్ 2023 లో భాగంగా గురువారం జరిగిన ఇండియా మరియు శ్రీలంక తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఇండియా 302 పరుగుల భారి ఆధిక్యంతో విజయం సాధించింది.

అంతేకాదు వరుసగా 7 విజయాలతో పాయింట్స్ టేబుల్ లో అగ్రస్థానం తో పాటు సెమీస్ కి క్వాలిఫై అయిన మొదటి టీం గా టీం ఇండియా నిలిచింది.

ఇండియా: 357-8 / 50ఓవర్లు (విజేత)
శ్రీలంక: 55-10 / 19.4 ఓవర్లు

మ్యాచ్ హైలైట్స్: (India Vs Sri Lanka Match Highlights)

ఈ మ్యాచ్ లో ముందుగా శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బాటింగ్ కు దిగిన ఇండియా నిర్ణీత 50 ఓవర్ లకు 357 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. ఇండియా ఇన్నింగ్స్ లో గిల్ 92 పరుగుల తో టాప్ స్కోరర్ గా నిలవగా, కోహ్లీ 88 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 82 పరుగులు చేసారు.

శ్రీలంక బౌలర్లలు ప్రత్యర్థి ఇండియా ను భారీ స్కోర్ చేయకుండానే కట్టడి చేయడంలో విఫలం అయ్యారు. లంక బౌలర్లలో మధుసనక 5 వికెట్లు తీయగా… చమీర కు ఒక్క వికెట్ దక్కింది.

358 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగింది శ్రీలంక. అయితే లక్ష్య ఛేదనలో లంక తడబడింది. ఇండియా ఫాస్ట్ బౌలర్ల్స్ సిరాజ్, బుమ్రా ధాటికి లంక ఓపెనర్లు విలవిలలాడారు. తరువాత బౌలింగ్ కు వచ్చిన షమీ బౌలింగ్ కి లంక బ్యాటర్లు కుదేలయ్యారు. దీంతో కేవలం ౫౫ పరుగులకే చాప చుట్టేశారు.

ఇండియా బౌలర్లలో షమీ ఐదు వికెట్లతో చెలరేగగా… సిరాజ్ మూడు వికెట్లు, బుమ్రా మరియు జడేజా ఒక్కో వికెట్ తీశారు.

మ్యాన్ అఫ్ ది మ్యాచ్:

మహమ్మద్ షమీ– 5 వికెట్లు 18 పరుగులకి (5 ఓవర్లు)

WCW 2023 IND vs SL:

ALSO READ: World Cup 2023 Points Table: ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

విరాట్ కోహ్లీ.. పాకిస్తాన్ వచ్చి ఆడు: యూనిస్ ఖాన్

వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసినదే. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ యూనిస్...

ఆసియా కప్ లో భారత్ మహిళలు బోణి… పాక్ చిత్తు

IND vs PAK: భారత మహిళా క్రికెటర్లు అదరగొట్టారు. ఆసియా కప్ టీ20 2024లో (Womens Asia Cup T20 2024) భాగంగా...

Womens Asia Cup T20 2024: నేడు భారత్ తో పాక్ పోరు

నేటి నుంచి మహిళా ఆసియ కప్ టీ20 2024 (Womens Asia Cup T20 2024) ప్రారంభం. ఈ టోర్నమెంట్ లో భాగంగా...

ఐదో టీ20లో భారత్ విజయం… సిరీస్ కైవసం

IND vs ZIM 5th T20: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకున్న భారత్. ఆదివారం జింబాబ్వేలోని హరారే...

జింబాబ్వే చిత్తు… రెండో టీ20లో భారత్ విజయం

జింబాబ్వేలోని హారరే వేదికగా నిన్న (IND vs ZIM 2nd T20) మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో 100 పరుగుల...

టీ20కు రిటైర్మెంట్ ప్రకటించిన టీం ఇండియా స్టార్ ప్లేయర్లు

భారత్ క్రికెట్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. టీమిండియా స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20...

ఫైనల్ కు భారత్… సెమీస్ లో ఇంగ్లాండ్ పై ఘన విజయం

IND vs ENG: టీ20 ప్రపంచకప్ లో (T20 World Cup 2024) భాగంగా గయానా వేదికగా నిన్న భారత్ మరియు ఇంగ్లాండ్...

T20 WC 2024 IND vs AUS: నేడు ఆస్ట్రేలియా తో తలపడనున్న భారత్

IND vs AUS: టీ20 ప్రపంచకప్ 2024 (T20 World Cup 2024) లో భాగంగా సెయింట్ లూసియా స్టేడియం వేదికగా నేడు...

IND vs AFG: 47 పరుగుల తేడాతో ఇండియా ఘన విజయం

IND vs AFG: సూపర్-8 లో టీం ఇండియా బోణి కొట్టింది. తీ20 ప్రపంచకప్ లో భాగంగా బార్బడోస్ వేదికగా నిన్న ఆఫ్ఘానిస్తాన్...

T20 WC IND vs AFG: నేడు భారత్-ఆఫ్ఘానిస్తాన్ మ్యాచ్

టీ20 ప్రపంచకప్ సూపర్-8 లో భాగంగా నేడు భారత్ మరియు ఆఫ్ఘానిస్తాన్ (IND vs AFG) తలపడనున్నాయి. గురువారం రాత్రి 8 గంటలకు...

కువైట్ లో భారీ అగ్ని ప్రమాదం… 41 మంది మృతి

కువైట్ లో భారీ అగ్ని ప్రమాదం (Kuwait fire accident)  చోటుచేసుకుంది. మీడియా సమాచారం ప్రకారం దక్షిణ కువైట్‌లోని మంగాఫ్ ప్రాంతంలోని ఒక...

మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం

భారతదేశ ప్రధాన మంత్రిగా మూడోసారి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ప్రమాణస్వీకారం (PM Narendra Modi Oath Ceremony) చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి...