IND vs ZIM 5th T20: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకున్న భారత్. ఆదివారం జింబాబ్వేలోని హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన ఐదవ టీ20 మ్యాచ్ లో 42 పరుగుల తేడాతో టీం ఇండియా విజయ కేతనాన్ని ఎగరవేసింది.
ముందుగా టాస్ ఒదిగి బ్యాట్టింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో సంజు శాంసన్ 58 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా పరాగ్ 22 పరుగులు, దూబే 26 పరుగులతో జట్టుకి గౌరవ ప్రదమైన స్కోర్ ను అందించారు.
జింబాబ్వే బౌలర్లలో ముజార్బాని రెండు వికెట్లు తీసుకోగా… రాజా, నగరవా, మవుతా తలొక వికెట్లు దక్కించుకున్నారు.
అనంతరం 168 పరుగుల లక్ష్యంతో బ్యాట్టింగ్ కు దిగిన జింబాబ్వే 18.3 ఓవర్లలో 125 పరుగులు చేసి అల్ అవుట్ అయ్యింది. జింబాబ్వే బ్యాటర్లలో మేర్స్ 34 పరుగులు చేయగా మిగిలినవారెవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోవడంతో లక్ష్యాన్ని అందుకోవడంలో జింబాబ్వే విఫలం అయ్యింది అనే చెప్పాలి.
భారత్ బౌలర్లలో ముకేశ్ కుమార్ 4 వికెట్లతో అత్యద్భుత ప్రదస్సనతో రాణించగా…దూబే రెండు వికెట్లు, తుషార్ దేష్పాండే మరియు సుందర్ చెరొక వికెట్ దక్కించుకున్నారు.
మ్యాన్ అఫ్ ది మ్యాచ్: శివమ్ దూబే
For his all-round impact in the 5th T20I, Shivam Dube wins the Player of the Match award 🏆👏
Scorecard ▶️ https://t.co/TZH0TNJcBQ#TeamIndia | #ZIMvIND | @IamShivamDube pic.twitter.com/yxO8KifBK5
— BCCI (@BCCI) July 14, 2024
మ్యాన్ అఫ్ ది సిరీస్: వాషింగ్టన్ సుందర్
5⃣ matches
8⃣ wickets 🙌For his brilliance with the ball, Washington Sundar becomes the Player of the series 👏👏
Scorecard ▶️ https://t.co/TZH0TNJcBQ#TeamIndia | #ZIMvIND | @Sundarwashi5 pic.twitter.com/pVBJ29nreN
— BCCI (@BCCI) July 14, 2024
ఐదో టీ20లో భారత్ విజయం (IND vs ZIM 5th T20):
𝙒𝙄𝙉𝙉𝙀𝙍𝙎!#TeamIndia clinch the T20I series 4⃣-1⃣ 👏👏
Scorecard ▶️ https://t.co/TZH0TNJKro#ZIMvIND pic.twitter.com/ulza0Gwbd7
— BCCI (@BCCI) July 14, 2024
ALSO READ: జింబాబ్వే చిత్తు… రెండో టీ20లో భారత్ విజయం