ఆంధ్ర ప్రదేశ్ లో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటిస్తున్న సంగతి తెలిసినదే. అయితే ఈ రోజు అనగా మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం విజయవాడలో నిర్వహించిన సమావేశానికి వైసీపీ తరఫున ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి హాజరు (Vijayasai Reddy meet Central Election Commission) కావడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశం అనంతరం విజయసాయిరెడ్డి మీడియా తో మాట్లాడుతూ… గుర్తింపులేని జనసేన పార్టీకి అనుమతి ఎలా ఇచ్చారన్న విషయాన్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్లామని (Vijayasai Reddy Questions Janasena Appearence) ఆయన తెలిపారు.
అలాగే… జనసేన పార్టీను ఇప్పటివరకు బీజేపీ భాగస్వామ్య పార్టీగా పరిగణిస్తూ వచ్చారని. అయితే నిన్న ఎన్నికల సంఘానికి ఇచ్చిన అభ్యర్థనలో మాత్రం జనసేనని టీడీపీ భాగస్వామ్య పార్టీ అని పేర్కొన్నారు. మరి జనసేన పార్టీ బీజేపీ భాగస్వామ్య పక్షమా, టీడీపీ భాగస్వామ్య పక్షమా?
అంతేకాకుండా గ్లాసు గుర్తు (Glass Symbol) అనేది జనరల్ సింబల్.. మొత్తం 175 స్థానాల్లో కేవలం కొన్ని స్థానాల్లోనే పోటీ చేసే ఒక పార్టీకి సాధారణ గుర్తుల్లోంచి ఒక సింబల్ కేటాయించడం చట్ట విరుద్ధమని కూడా మేం వివరించాం అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
జనసేన పార్టీకి అనుమతి ఎలా ఇచ్చారు?(Vijayasai Reddy Questions Janasena Appearence) :
జనసేన పార్టీకి గుర్తింపు లేకున్నా ఎందుకు ఆహ్వానించారని సీఈసీని అడిగాం.. -విజయసాయి రెడ్డి#VijayasaiReddy #YSRCP #AndhraElections2024 #PawanKalyan #JanasenaParty #glass #ElectionCommission #AndhraPradesh #NTVTelugu pic.twitter.com/N0tnyf65bs
— NTV Telugu (@NtvTeluguLive) January 9, 2024
ALSO READ: వైసీపీకి అంబటి రాయుడు రాజీనామా