Telangana Assembly Elections Schedule 2023: తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న జరుగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంగం ప్రకటించింది. 2023 నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేయనున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సోమవారం మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్రంతో సహా ఐదు రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేసింది.
ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఎన్నికల సంగం మీడియా సమావేశంలో… మధ్య ప్రదేశ్ లో 230 స్థానాలు, రాజస్థాన్ లో 200 స్థానాలు, తెలంగాణలో 119 స్థానాలు, ఛత్తీస్‌గఢ్ లో 90 స్థానాలు, మిజోరాం లో 40 స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. అంతేకాదు ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వ్యయంపై నిరంతర నిఘా ఉంచుతున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తెలిపారు.
ఈ ప్రకటనతో 5 రాష్ట్రాలలోని పార్టీలలో ప్రచార కార్యక్రమాలు, ఎన్నికల హడావిడి ఊపందుకోనున్నాయి. అంతే కాదు ఎన్నికలు షెడ్యూల్ విడుదల ఇవాళ అవడంతో రాష్ట్రాల్లో నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలు లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ ఎన్నికల షెడ్యూల్: (Telangana Elections 2023 Schedule)
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న జరుగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంగం ప్రకటించింది. నామినేషన్లు సమర్పించేందుకు చివరి తేదీని నవంబర్ 10 కి ఖరారు చేయగా… పోలింగ్ తేదీని నవంబర్ 30 కు, ఓట్ల కౌంటింగ్ డిసెంబర్ 3న చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
📢 #Telangana Assembly Elections – 2023 schedule released 👇
📄Last date for nominations: November 10, 2023 (Friday)
🗳️ Date of polling: November 30, 2023 (Thursday)
📣 Announcement of results: December 3, 2023 (Sunday) pic.twitter.com/yesZIgPYAC
— Mission Telangana (@MissionTG) October 9, 2023
ఐదు రాష్ట్ర ఎన్నికల షెడ్యూల్: (Elections 2023 Schedule)
Assembly Elections 2023: Polling in 5 states from November 7, results on December 3. #AssemblyElections2023 #ElectionCommission #AssemblyElections2023 #Elections2023 #TelanganaElections2023 #TelanganaAssemblyElections pic.twitter.com/VxuB1c4Pgd
— Avaaz24 (@Avaaz24Media) October 9, 2023
ALSO READ: తెలంగాణ ఎన్నికలు: బరిలోకి దిగుతున్న నేతల పూర్తి జాబితా ఇదే