మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించాలి – BRS రాష్ట్ర సీనియర్ నాయకుడు బీరయ్య యాదవ్!

Date:

Share post:

మెదక్ ఎ౦పీ టికెట్ ను తనకు కేటాయి౦చాలని తెల౦గాణా ఉద్యమకారుడు, BRS సీనియర్ నాయకులు శ్రీ బీరయ్య యాదవ్ ( Shri Beeraiah Yadav), పార్టీ జాతీయ అద్యక్షులు శ్రీ కల్వకు౦ట్ల చ౦ద్రశేఖర్ రావుకు లేఖ రాసారు.

మలిదశ‌ తెలంగాణ ఉద్యమం తొలినాటి నుంచి దాదాపు 24 సంవత్సరాలుగా నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలాగే తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం ఉమ్మడి మెదక్ జిల్లా అంతట అవిశ్రాంతంగా పనిచేయడం జరిగింది అని లేఖలో పేర్కొన్నారు.

అనేక పోలీస్ కేసులు లాఠీ దెబ్బలు చివరకు ఆఖరికి మరి జైలు కూడా వెళ్లడం జరిగింది. ఆనాడు నుండి నేటి వరకు నేను మరి ఎలాంటి పార్టీ నుంచి పదవులు గాని మరి ఆర్థికంగా ప్రయోజనాలను గాని పొందలేదు అనే విషయాన్ని గుర్తుచేస్తు లేఖలో ప్రస్తావి౦చారు.

జనవరి 19 నాడు జరిగిన మెదక్ పార్లమెంటరీ సమావేశంలో BRS అధినేత కేసీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని అలాగే మాజీ మంత్రి హరీష్ రావు గారిని కలిసి లేఖ ఇవ్వడ౦ జరిగి౦దని అవాజ్ 24 తెలుగు ప్రతినిధితో చెప్పారు.

ఈ సందర్భంగా బీరయ్య యాదవ్ మాట్లాడుతూ ఏడు అసెంబ్లీ నియోజకవర్గ అన్ని వర్గాల ప్రజలతో విస్తృతమైన సంబంధాలు ఉన్నాయని కేసీఆర్ గారి ఆశిశ్శులతో గతంలో BRS రాష్ట్ర కార్యదర్శిగా, వివిధ ఎన్నికల్లో పలు జిల్లాల, మండల ఇంచార్జ్ గా పని చేశానని అన్నారు. జిల్లాలో నాకు తెలంగాణ ఉద్యమకారుడిగా బీసి నేతగా ప్రజల్లో మంచి గుర్తింపు ఉందని, తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కుర్మల జనాభా సంఖ్య దాదాపు 50 లక్షల వరకు ఉందని, ఈ వర్గాల ప్రతినిధిగ నాకు అవకాశం కల్పించాలని పార్టీ అదిష్టానాన్ని, అదే విదంగా జిల్లాలోని MLA లను కోరడ౦ జరిగి౦దని తెలిపారు.

మెదక్ ప్రజలు, నాయకులతో సత్సంభందాలు ఉండడంతో పార్టీకి విధేయుడిగా ఉన్న తనకు మెదక్ ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందిగా అధినేత కేసీఆర్ ను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ నాయకుడు ఉస్మాన్ అలీ, విద్యార్థి నాయకుడు అఖిల్, యువజన నాయకుడు నరేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

Newsletter Signup

Related articles

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు (Secunderabad Cantonment MLA Lasya Nanditha Died in...

సిద్దిపేట సబ్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

సిద్దిపేటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్‌ చౌరస్తా వద్ద ఉన్న 220 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా...

గ్రూప్ 1 పోస్టులలో మహిళలకు అన్యాయం: MLC కవిత

తెలంగాణ: గ్రూప్ 1 పోస్టులలో మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు (MLC Kavitha...

తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం

తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ ఎంపీలుగా ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు (Telangana 3 Rajya Sabha Seats Unanimous). మూడు స్థానాలకు గాను...

ముఖ్యమంత్రిగా చేసావా లేక చప్రాసీగానా: CPI నారాయణ

సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ, మాజీ సీఎం కేసీఆర్ పై సంచల వ్యాఖ్యలు చేశారు (CPI Narayana Comments on KCR)....

సెక్రటేరియట్‌లో రాజీవ్ గాంధీ విగ్రహం… బీఆర్ఎస్ ఆగ్రహం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు గాను తెలంగాణ సచివాలయంలో బుధవారం శంకుస్థాపన...

అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిరసన

తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసనకు దిగారు (BRS MLA Protest in Assembly). బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పై...

ఎంపీ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని కోరిన బీరయ్య యాదవ్

మెదక్ ఎంపీ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని MLC కవిత గారిని, మాజీ మంత్రి నర్సాపూర్ MLA సునీతా గారిని కోరిన బీరయ్య యాదవ్...

బీరయ్య యాదవ్ కు మెదక్ ఎంపీ టికెట్ ఇవ్వాలి

తెల౦గాణ బ్యూరో ప్రతినిధి, ఉద్యమకారుడు, BRS సీనియర్ నాయకులు బీరయ యాదవ్ ను మెదక్ పార్లమెంట్ నియోజక వర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా...

నన్ను.. నా పార్టీని టచ్ చేయడం నీ వల్ల కాదు: కేసీఆర్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు (KCR Comments on Revanth Reddy). తెలంగాణ అసెంబ్లీ...

బీఆర్ఎస్ కు షాక్… కాంగ్రెస్ లో చేరిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్

Telangana: పార్లమెంట్ ఎన్నికల దగ్గరవుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. మంగళవారం ఉదయం పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్...

మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం కల్పించాలి: బీరయ్య యాదవ్

సంగారెడ్డి- గజ్వేల్ MLA గా గెలుపొంది ప్రమాణ శ్వీకారం చేసిన BRS పార్టీ అధినేత కేసీఆర్ గారిని తన నివాసంలో కలిసి శుభాకాంక్షలు...