వైసీపీకి ఊహించని షాక్ నిచ్చింది కూటమి ప్రభుత్వం. తాడేపల్లిలోని నిర్మాణంలో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయాన్ని CRDA అధికారులు కూల్చివేతున్నారు (Tadepalli YCP Party Central Office Demolished). ఈ ఘటనకు (YSRCP office Demolition) సంభందించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియా లో ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఈ రోజు తెల్లవారుజామున సుమారు 5:30 నిముషాలు నుంచి ప్రోక్లైన్లు, బుల్లడోజర్ల సహాయంతో వైసీపీ పార్టీ కార్యాలయం కుచివేత పనులు ప్రారంభించారు. అయితే ఈ కుచివేత పనులపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా పార్టీ కార్యాలయం కూల్చివేత ఘటనపై వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. “ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైసీపీ తలొగ్గేది లేదు, వెన్నుచూపేది అంతకన్నా లేదు” అని జగన్ ట్వీట్ చేశారు.
YS Jagan Tweet:
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన @YSRCParty కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా…
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 22, 2024
వైసీపీ కార్యాలయం కూల్చివేత (Tadepalli YCP Central Office Demolished):
తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేస్తున్న CRDA అధికారులు
ఉదయం 5.30 గంటల నుంచి భారీ పోలీస్ బందోబస్తు మధ్య బుల్డోజర్లు, పొక్లెయినర్లతో కూల్చివేత పనులు మొదలుపెట్టారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లిలోని 2 ఎకరాల్లో పార్టీ కార్యాలయం నిర్మాణం… pic.twitter.com/pN9Sv7J9fA
— Telugu Scribe (@TeluguScribe) June 22, 2024
ALSO READ: పేరు మార్చుకున్న ముద్రగడ… గెజిట్ నోటిఫికేషన్ విడుదల