ఒకప్పుడు బిచ్చగత్తె, ఇప్పుడు ప్రఖ్యాత మోడల్… జీవితాన్ని మార్చిన క్లిక్

Date:

Share post:

ఆకు చాటున దాక్కున్న విరజాజి సౌరభం దాన్ని ప్రపంచానికి చాటుతుంది. అదృష్టం ఏ మూల నుంచైనా తలుపు తట్టి పిలవటం నిజమైతే దాన్ని పదమూడేళ్ల Rita Gaviola జీవితం రుజువు చేసింది.

రీటా ఫిలిప్పీన్స్ లోని లుక్పేన్ వీధుల్లో బిచ్చగత్తె. ఆమె తండ్రి చెత్త సేకరించే ఉద్యోగి. ఇంట్లో ఐదుగురు పిల్లల్ని చూసుకోవటం లోనే ఆమె తల్లి ఓపిక అయిపోతూ ఉండేది. ఒక్క రోజు కూడా ఆ కుటుంబం లో ఎవ్వరూ కడుపునిండా తిని ఉండరు. ఆకలి భరించలేక రీటా ఆదాయం కోసం వీధుల్లో బిచ్చం ఎత్తేది.

2016 లో నిజంగానే అదృష్ట దేవత ఆమె ముందుకు వచ్చి నిలబడింది. ఫిలిప్పీన్స్ ఫోటోగ్రాఫర్ టోఫెర్ క్వింటో బర్గోస్ 2016 లో లుక్పేన్ లో జరుగుతున్న పహియన్ ఫెస్టివల్ లో ఫోటోలు తీసేందుకు వచ్చి రీటాని చూశాడు. ఆమె చాలా గ్రేస్ ఫుల్ గా ఉంది, చక్కని ఫోటో జెనిటిక్ ఫేస్ అని గుర్తించి ఆమె ఫోటోలు తీసి ఇంటర్నెట్ లో పెట్టాడు. గంటల్లో ఆమె ప్రపంచానికి తెలిసిపోయింది.

rita gaviola begging

rita gaviola Philippines model
Photos: Insta @itsritagaviola

బాడ్జో తెగకు చెందిన ఆమెను బాడ్జో గర్ల్ అన్నారు నెటిజన్లు. ఆమె సౌందర్యాన్ని మిస్ వరల్డ్ ఫిలిప్పీన్స్ హిల్లరీ డేనియల్ వరుంగావో ఆకాశానికి ఎత్తేశారు. 2014 మిస్ ఇంటర్నేషనల్ బియాంకా గుడోటీ, మిస్ ఎర్త్ ఏంజెలియా ఓంగ్ లు ఆమెకు సోషల్ మీడియాలో అభినందలు చెప్పారు. అడ్వర్టైజ్ మెంట్ ఏజెన్సీల దృష్టిలో పడింది రీటా. ఎన్నో బ్రాండ్ ల మోడల్ గా పనిచేసింది. టి.వి సీరీస్ లో ఆమెకు అవకాశాలు వచ్చాయి. మన బిగ్ బాస్ వంటి బిగ్ బ్రదర్ అనే అంతర్జాతీయ షో లో పాల్గొన్న అతి చిన్న వయస్సు గల అభ్యర్థి రీటానే. దేశ విదేశాల నుంచి ఆమెకు ఆర్థిక సాయం అందింది.

rita photo shoot
Photos: Insta @itsritagaviola

2018 లో సొంత ఇల్లు కొనుక్కుంది రీటా. ఆ ఇంటిని యూట్యూబ్ లో అప్ లోడ్ చేసి తనకు ఆర్థిక సాయం అందించిన అమెరికన్ అభిమాని గ్రేస్ క్రుట్జరీ కి థాంక్స్ చెబుతూ పోస్ట్ పెట్టింది రీటా. ఆమె ఇంస్టాగ్రామ్ లో ఎంతో పాప్యులర్. లక్షల‌ మంది ఫాలోయర్స్ తో రీటా ఇప్పుడు ప్రఖ్యాత మోడల్. ఇప్పుడు చక్కగా చదువుకుంటుంది రీటా.

rita gaviola photo shoot
Photos: Insta @itsritagaviola

సరైన సమయంలో ఫోటోగ్రాఫర్ టోఫెర్ క్వింటో తీసిన ఒక క్లిక్ ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆకలి అంటూ చేతులు చాచిన రీటా పైన ఇప్పుడు అభినందనల సుమ వర్షం కురుస్తోంది !

For more pictures, follow Rita Gaviola on her Instagram  https://www.instagram.com/itsritagaviola/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

World Happiness Report: 116వ ర్యాంకులో భారత్

Happiest Countries in World: ప్రపంచవ్యాప్తంగా ప్రజల సంతోష స్థాయిని అంచనా వేసే ప్రపంచ సంతోష సూచిక (World Happiness Report) తాజా...

ఇన్‌స్టాగ్రామ్ లో పెద్ద మార్పు… చాట్ భద్రత పై కీలక నిర్ణయం

సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) ప్లాటుఫార్మ్స్ కు చెందిన ఇన్‌స్టాగ్రామ్ ముఖ్యమైన మార్పుని (Instagram Chat Privacy) ప్రకటించింది. ఎండ్ టు...

రష్యా “Dead Hand” గురుంచి విన్నారా? ఇది ప్రపంచాన్ని ఎలా నాశనం చేస్తుందంటే…

ప్రపంచంలో అణ్వాయుధాల గురించి చర్చ వచ్చినప్పుడు అమెరికా, రష్యా వంటి దేశాలే ముందుగా గుర్తుకు వస్తాయి. అయితే అణు యుద్ధ చరిత్రలో అత్యంత...

అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న జో బైడెన్

అమెరికా రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకొన్నది. అమెరికా అధ్యక్ష రేసు నుంచి డెమోక్రాటిక్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకుంటున్నట్లు (Joe...

Bangladesh: రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం… 44 మంది మృతి

బాంగ్లాదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి బాంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని (Dhaka) ఒక ఏడంతస్తుల రెస్టారెంట్లో భారీ అగ్ని...

పాకిస్తాన్ లో 4.7 తీవ్రతతో భూకంపం

పాకిస్తాన్ లో భూకంపం సంభవించింది. శనివారం ఉదయం ఇస్లామాబాద్ (Islamabad) సమీపంలో రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో భూకంపం (Pakistan Earthquake) సంభవించినట్లు...

King Charles III: బ్రిటన్ రాజు ఛార్లెస్ కు కాన్సర్

బ్రిటన్ రాజు చార్లెస్ 3 క్యాన్సర్‌తో భాదపడుతున్నట్లు (Britain King Charles 3 diagnosed with Cancer) బకింగ్‌హామ్ ప్యాలెస్ విడుదల చేసిన...

మాల్దీవ్స్ ప్రెసిడెంట్ పై అవిశ్వాస తీర్మానం

భారత్ ప్రధాని నరేంద్ర మోదీ పై మాల్దీవ్స్ మంత్రులు చేసిన వ్యాఖ్యలు మన దేశంలోనే కాకుండా ఆ దేశంలో కూడా చిచ్చు రేపుతున్నాయి....

లైబీరియాలో ఇంధన టాంకర్ పేలి 40 మంది మృతి

Liberia Fuel Tanker Explosion: లైబీరియాలోని టొటోటాలో ఘోర ప్రమాదం సంభవించింది. పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడి పేలిన ఘటనలో సుమారు 40...

చైనాలో భారీ భూకంపం… 100 మందికి పైగా మృతి

చైనాలో అర్థరాత్రి భారీ భూకంపం సంభవిందించి. సోమవారం అర్థరాత్రి సంభవించిన ఈ భూకంపం (China Earthquake) లో ఇప్పటికే 100 మందికి పైగా...

నేపాల్ లో భారీ భూకంపం… 128 మంది మృతి

Nepal Earthquake: నేపాల్ దేశంలో ప్రకృతి విలయతాండవం చేసింది. శుక్రవారం రాత్రి నేపాల్ లో భారీ భూకంపం సంభవించింది... ఈ విషాద ఘటనలో...

పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి… పండగ వేళ విషాదం, 52 మంది మృతి

Pakistan Suicide Bomb Blast: పండుగ వేళ పాకిస్తాన్ లో ప్రమాదం చోటు చేసుకుంది. పాకిస్థాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఒక...