Rajahmundry Agarbatti Scam: ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి నగరంలో అగర్బత్తి తయారీ పేరుతో భారీ మోసం బయటపడింది. మీడియా సమాచారం ప్రకారం… ఈ స్కామ్‌లో సుమారు రూ.25 కోట్లు వరకు మోసం జరిగినట్లు తెలుస్తోంది. అలాగే ఈ స్కామ్‌లో సుమారు 3,000 మంది మహిళలు మోసపోయినట్లు సమాచారం.
ఎలా మోసం చేశారు? ( Rajahmundry Agarbatti Scam)
మీడియా సమాచారం మరియు వార్త కథనాల (NTV Telugu) ప్రకారం…
అనకాపల్లికి చెందిన వరద మోహన్ కృష్ణ అనే వ్యక్తి, ఇంటి వద్దే అగర్బత్తులు తయారు చేస్తే (Work From Home Scam) నెలకు ₹12,500 సంపాదించవచ్చని చెప్పి మహిళలను ఆకర్షించాడు. అయితే ఈ పథకంలో చేరాలంటే ఒక్కొక్కరు ₹1 లక్ష డిపాజిట్ చేయాలని. అలా తయారు చేసిన అగర్బత్తులను కంపెనీ తిరిగి కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చాడు.
యూట్యూబ్ వీడియోల ద్వారా ప్రచారం
ఈ స్కీమ్‌ను సంద్యారాణి అనే వ్యక్తి యూట్యూబ్ వీడియోల ద్వారా ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. ఈ విధంగా ఉభయ గోదావరి జిల్లాలు మరియు ఇతర ప్రాంతాల నుంచి డబ్బులు సేకరించి, మొత్తం సుమారు ₹25 కోట్ల వరకు మోసం చేసినట్లు సమాచారం.
మోసం ఎలా బయటపడింది?
గత కొన్ని నెలల పాటు డిపాజిట్ దారులకు రావలసిన నెలవారీ ఆదాయం నిలిచిపోవడంతో బాధితులలో ఆందోళన మొదలయింది. కంపెనీ ప్రతినిధులు కూడా ఈ విషయం పట్ల స్పందిచపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీనితో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
విచారణ:
బాధితుల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రధాన నిందితులు, వారి సహాయకులు ఎవరు, డబ్బు ఎక్కడికి మళ్లించబడింది అనే దానిపై విచారణ కొనసాగుతోంది.
ఈ ఘటనపై మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది…
హెచరిక : (Caution)
రాజమండ్రిలో వెలుగులోకి వచ్చిన ఈ అగర్బత్తి స్కామ్ (Rajahmundry Agarbatti Scam) ఒక గట్టి హెచ్చరిక. ఎంత ఆకర్షణీయంగా కనిపించినా, పెట్టుబడి పెట్టే ముందు పూర్తిగా సమాచారం సేకరించడం చాలా అవసరం. ముఖ్యంగా ఉపాధి అవకాశాల పేరుతో డబ్బు అడిగే సంస్థలపై అప్రమత్తంగా ఉండడం మంచిది.
ALSO READ: కరీంనగర్ RBL బ్యాంక్‌లో భారీ స్కాం… కోట్ల రూపాయలు మాయం




