Rahul Gandhi Telangana Bus Yatra: అఖిలభారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మొదటి విడత బస్సు యాత్ర అనంతరం రాహుల్ గాంధి తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తీయటీ చేశారు.
‘ఈ ఎన్నికల్లో… ‘దొరల’ తెలంగాణ, ‘ప్రజల’ తెలంగాణ మధ్య పోరు జరగబోతోంది.’ అని రాహుల్ ట్వీట్ చేశారు. అంతే కాకుండా కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీలు తెలంగాణలోని ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తాయన్నారు.
కాంగ్రెస్ సునామీ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రాన్ని తుడిచిపెట్టి, బంగారు తెలంగాణ కలను సాకారం చేస్తుంది – ఇది నా గ్యారెంటీ! అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ 6 హామీలు:
మహాలక్ష్మి
– మహిళలకు నెలకు ₹2,500.
– ఉచిత బస్సు ప్రయాణం.
– ₹500కి గ్యాస్ సిలిండర్.
ఇందిరమ్మ ఇండ్లు
– ఇల్లు కట్టుకోవడానికి ₹5 లక్షల సహాయం.
– తెలంగాణ ఉద్యమ యోధులకు 250 చదరపు గజాల స్థలం.
గృహ జ్యోతి
– 200 యూనిట్ల ఉచిత విద్యుత్.
యువ వికాసం
– కళాశాల విద్యార్థులకు ₹5 లక్షల సహాయం.
చేయూత
– సీనియర్ సిటిజన్లు, వితంతువులు, వికలాంగులు మరియు ఇతరులకు ₹4,000 నెలవారీ పెన్షన్.
– రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ₹10 లక్షల ఆరోగ్య భీమా.
రైతు భరోసా
– రైతులకు సంవత్సరానికి ₹15,000 మరియు వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి ₹12,000.
This election is a fight between ‘Dorala’ Telangana and ‘Prajala’ Telangana.
Congress' 6 Guarantees will provide support to every family of Telangana.
✅ Mahalakshmi
– ₹2,500/month to women
– Free bus travel
– Gas cylinder for ₹500✅ Indiramma Indlu
– ₹5 lakh assistance to… pic.twitter.com/k2GdhQuMiW— Rahul Gandhi (@RahulGandhi) October 20, 2023
ALSO READ: కాంగ్రెస్ సీ టీమ్… సీటీమ్ అంటే చోర్ టీమ్- కేటీఆర్