జనసేన, తెలుగుదేశం కలిసి పోటీ చేస్తాయి: పవన్ కళ్యాణ్

Date:

Share post:

Janasena TDP Alliance: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలంగా మారాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మరియు జనసేన కలిసి పనిచేస్తాయి అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అంతేకాకుండా కచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ నిర్ణయానికి కలిసి వస్తుందని నేను నమ్ముతున్నాను అని పవన్ కళ్యాణ్ అన్నారు.

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రేమండ్ ఖైదీ గా ఉన్న మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో ములాఖత్ అనంతరం పవన్ కళ్యాణ్ ఈ ప్రకటన చేశారు. పవన్ తో పాటు నందమూరి బాలకృష్ణ మరియు నారా లోకేష్ చంద్రబాబును కలిసేందుకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లరు.

ప్రకటనలో భాగంగా పవన్ మీడియా తో మాట్లాడుతూ, గత నాలుగున్నరేళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో అరాచక పాలనా కొనసాగుతోందని…ఈ అరాచక పాలనలో భాగంగానే చంద్రబాబుని రేమండ్ కి పంపించారు అని విమర్శించారు.

తాను తీసుకున్న నిర్ణయం ‘మా ఇద్దరి భవిష్యత్తుకి సంబందించినది కాదు… ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబందించినది’ అని జనసేన అధినేత తెలియజేయడం జరిగింది.

అయితే పవన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సామజిక మాధ్యమాల్లో మిశ్రమ వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్దిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు.

విచారణ లేకుండా జైల్లో ఎలా?

స్కిల్ డెవలప్మెంట్ కేసు లో చంద్రబాబుని జైల్లో ఉంచడం బాధాకరమని, అసలు విచారనే లేకుండా ఎలా జైల్లో కుర్చో పెడతారు అని పవన్ ప్రశ్నించారు.

ఆరు నెలలే జగన్ :

జగన్ నీకు కేవలం ఆరు నెలలు మార్త్రమే ఉంది. ఆరు నెలలు తరువాత జగన్ మద్దత్తుదారులు ఎవరైనా సరే, మీరు యుద్ధమే కావాలనుకుంటే… మీకు యుద్ధమే ఇస్తాము అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.

సొంత అమ్మని సొంత అక్కని వదిలేసినా వ్యక్తి జగన్ అని. బాబాయ్ చనిపోతే వాళ్ళని వెనకేసుకొస్తున వ్యక్తి… అధికారులని ఎలా వెనకేసుకుని వస్తాడు అనుకుంటారు అని పవన్ ప్రశ్నించారు. అంతేకాకుండా జగన్ ని నమ్ముకొని వెళ్తే కుక్క తోక పట్టుకొని గోదారి ఈదినట్టే అధికారులకి చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది.

వై.స్.ఆర్.సీ.పీ పార్టీ ట్వీట్:

“ప్యాకేజ్ బంధం బయటపడింది”

నువ్వు రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్‌కి వెళ్ళింది @JaiTDP తో పొత్తును ఖాయం చేసుకునేందుక‌ని ప్ర‌జ‌ల‌కు పూర్తిగా అర్థం అయింది @PawanKalyan. ఇన్నాళ్ళూ నీమీద న‌మ్మ‌కం పెట్టుకున్న‌ అభిమానుల‌కు, కాస్తో కూస్తో నిన్ను న‌మ్మిన వాళ్ళ‌కు ఈరోజుతో భ్ర‌మ‌లు తొల‌గించేశావు. ఇక ఇది పొత్తులకి, ప్రజలకి మధ్య జరుగుతున్న యుద్ధం. ఇక మిమ్మల్ని మూకుమ్మడిగా ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టడానికి ప్రజలంతా సిద్ధం,  అని వై.స్.ఆర్.సీ.పీ ట్వీట్ చేసింది.

ALSO READ: చంద్రబాబు అరెస్ట్: హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు నిరసన

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

చంద్రబాబుని నమ్మొద్దు- ఎంఐఎం అధినేత ఓవైసీ

Asaduddin Owaisi Comments On Chandrababu: ఏపీలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్ట్ పై రెండు తెలుగు రాష్ట్రాల నాయకులు, భిన్న అభిప్రాయాలు...

తెలంగాణ ఎన్నికలు: బరిలోకి దిగుతున్న నేతల పూర్తి జాబితా ఇదే

Telangana Elections MLA Candidates Full list: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలవారీగా పోటీకి దిగుతున్న నేతల పూర్తి జాబితా ఇదే. రాష్ట్రంలో...

బాలకృష్ణ విజిల్… అసెంబ్లీ హడల్ !

Balakrishna Whistle in AP Assembly: ఆంధ్రలో అసెంబ్లీ సమావేశాలు వేడెక్కాయి. రెండవరోజు అసెంబ్లీ సమావేశంలో తెలుగు దేశం పార్టీ హిందూపూర్ ఎమ్మెల్యే...

అసెంబ్లీలో మీసం తిప్పిన బాలయ్య…! స్పీకర్ వార్నింగ్

Balakrishna AP Assembly: ఏపీ లో మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. గురువారం ఉదయం అసెంబ్లీ సమావేశం జరుగుతున్న...

చంద్రబాబు అరెస్ట్: హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు నిరసన

Hyderabad IT Employees Protest: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా సర్వత్రా నిరసన జ్వాలలు రగులుతున్నాయి. ఏపీ స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ...

ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు- నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna Comments on Jagan Government: స్కిల్ డెవలప్మెంట్ కేసు వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై కుట్ర చేసి అరెస్టు చేశారు...

ఖైదీ నెం: 7691, ఈ నెల 22 వరుకు చంద్రబాబుకు రిమాండ్

Chandrababu Khaidi No 7691: తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రాజముండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీ...

నేడు ఆంధ్రప్రదేశ్ బంద్‌కు టీడీపీ పిలుపు

AP Bandh: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసన తెలుపుతూ నేడు...

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్, తెదేపా లో ఉద్రిక్తత

Chandrababu arrest: శనివారం ఉదయం, టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో సీఐడీ...