ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ పార్టీకి ఎన్నికల ముందు పెద్ద షాక్ తగిలింది. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శనివారం తన కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీలో (Nellore MP Vemireddy Prabhakar Reddy Joins TDP) చేరారు.
రాష్ట్ర ప్రభుత్వం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వైసీపీ ఎంపీ టిక్కెట్ ఇచ్చినా ఆ పార్టీకి రాజీనామా (Nellore MP Vemireddy Prabhakar Reddy quits YSRCP and Joined TDP) చేసి టీడీపీలో చేరడం జరిగింది. నెల్లూరు లో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ఆయనను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తో పాటు నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్, మరికొందరు ఇవాళ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
పార్టీలో చేరిన అనంతరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ… తెలుగు దేశం పార్టీలో చేరినందుకు సంతోషంగా ఉందని. ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేస్తూనే ఉంటానని… మరింతమంది ప్రజలకు చేయాలనే రాజకీయాల వైపు అడుగేశానని ఆయన తెలిపారు.
అలాగే ‘‘భవిష్యత్‌లో మీ అందరి మద్దతు నాకు అవసరం. ప్రజలకు ఉపయోగపడే మరిన్ని మంచి పనులు చేస్తా’’ అని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు.
టీడీపీ లో చేరిన వైసీపీ ఎంపీ (Nellore MP Vemireddy Prabhakar Reddy Joins TDP):
నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎంపీ టిక్కెట్ ఇచ్చినా ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిపోయారు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.
నెల్లూరు లో జరిగిన కార్యక్రమంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు.
వేమిరెడ్డితో పాటు మాజీ మంత్రి అనిల్ కుమార్ బాబాయ్ రూప్… pic.twitter.com/aCHq3h9nTl
— Telugu360 (@Telugu360) March 2, 2024
ALSO READ: టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్