మధ్యప్రదేశ్ రాష్ట్రం నూతన ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ (Mohan Yadav Madhya Pradesh CM) ప్రమాణ స్వీకారం చేశారు. భోపాల్ పరేడ్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ మంగూబాయ్ పటేల్ మోహన్ యాదవ్ తో ప్రమాణం చేయించారు.
అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులుగా రాజేంద్ర శుక్లా, జగదీశ్ దేవ్డా కూడా ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాలిగొన్నారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే మరియు కొందరు కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
మొత్తం 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ శాసనసభకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ 163 సీట్లను గెలుచుకుని మరోసారి అధికారం నిలబెట్టుకున్న విషయం తెలిసిందే.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ (Mohan Yadav Madhya Pradesh CM Oath Ceremony):
मैं डॉ॰ मोहन यादव ईश्वर की शपथ लेता हूँ… pic.twitter.com/4WPKTXLQev
— Dr Mohan Yadav (@DrMohanYadav51) December 13, 2023
देश के हृदयस्थल मध्य प्रदेश के मुख्यमंत्री पद की शपथ लेने पर डॉ. मोहन यादव जी और उप मुख्यमंत्री जगदीश देवड़ा जी एवं राजेंद्र शुक्ला जी को हार्दिक बधाई! मुझे विश्वास है कि आपके नेतृत्व में राज्य में डबल इंजन सरकार दोगुने जोश के साथ काम करेगी और विकास के नए प्रतिमान गढ़ेगी। इस… pic.twitter.com/wCkscH0l2M
— Narendra Modi (@narendramodi) December 13, 2023
ALSO READ: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం