Cyclone Michaung: మిచౌంగ్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ ఉగ్రరూపాన్ని ధరించింది ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది. గంటకు 7 కిలోమీటర్ల వేగంతో తీరం వైపుకు దూసుకొస్తున్న తుఫాన్… ఇవాళ మద్యాహ్నానికి బాపట్ల వద్దే తీరం దాటవచ్చని ఐఎండి అంచనా వేస్తోంది.
తుపాను తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుండడంతో ఐఎండి కోస్తాతీరం వెంబడి రెడ్ అలర్ట్ ప్రకటించింది. అంతేకాదు తీరం వెంబడి ఉన్న జిల్లాల్లో మాత్రం అతి భారీ వర్షాలు పడనున్నట్లు సమాచారం.
మిచౌంగ్ తుఫాన్ తీరానికి సమీపిస్తుండడంతో కోస్తాతీరం వెంబడి భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. అంతేకాదు ఈ తుఫాన్ ప్రభావంతో ఏపీ రాష్ట్రం అంతా విస్తారంగా వర్షాలు పడనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పటికే కోనసీమ, కాకినాడ, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, నెల్లూరు, గుంటూరు, తిరుపతి , ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు సోమవారం నుంచి కురుస్తున్నాయి.
తుపాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే చాలా జిల్లాల్లో విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవలు ప్రకటించింది. అంతేకాదు ఈ తుపాను ప్రభావంతో ఇప్పటికే పలు రైళ్లు రద్దైన విషయం తెలిసినదే.
Michaung Cyclone:
Severe Cyclonic Storm #Michaung effect, heavy rainfall in the #Tirupati district also, water flowing over the roads at Jangalapalli in Yerpedu mandal after gates of the dams opened. Several roads are damaged.#Michaungcyclone #CycloneMichaung#CycloneMichuang #AndhraPradesh pic.twitter.com/tfN8LJEEh2
— Surya Reddy (@jsuryareddy) December 5, 2023
#CycloneMichaung, which is swirling over the Bay of Bengal, is all set to make landfall near Bapatla on the Andhra Pradesh coast#IMD scientist Umasankar Das shares details #WATCH pic.twitter.com/L4UFBvvpJ4
— OTV (@otvnews) December 5, 2023
ALSO READ: ఢిల్లీ లో దారుణం… బిరియాని డబ్బుల కోసం యువకుడి హత్య