మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మన్నె జీవన్ రెడ్డి పేరును ప్రకటించింది (Manne Jeevan Reddy Mahbubnagar Congress MLC Candidate) . ఈ సందర్భంగా శుక్రవారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేయడం జరిగింది.
కాగా, లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ 36 మందితో తొలి జాబితా ప్రకటించిన విషయం తెలిసినదే. అయితే అందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన నాలుగు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.
తెలంగాణ ఎంపీ అభ్యర్థులు:ph
జహీరాబాద్- సురేశ్ షెట్కార్
కుందూరు రఘువీర్
చేవెళ్ల- సునీతా మహేందర్ రెడ్డి
మహబూబాబాద్- బలరాం నాయక్
మరోపక్క బీఆర్ఎస్ పార్టీ నుంచి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్ నవీన్ కుమార్ రెడ్డిని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎంఎల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మన్నే జీవన్ రెడ్డి పేరు ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం. pic.twitter.com/yYckKNTNCF
— Telugu Scribe (@TeluguScribe) March 8, 2024
ALSO READ: విశాఖపై వైసీపీ విజన్ ఇదే: వైఎస్ షర్మిల