కామారెడ్డి జిల్లాలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సిరిసిల్ల రోడ్డులోని అయ్యప్ప షాపింగ్ మాల్లో ( (Kamareddy Shopping Mall Fire Accident) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అనంతరం ఆ మంటలు మాల్లోని మిగతా అంతస్థులకు చేరినట్టు తెల్సుతోంది.
అర్ధరాత్రి షాపింగ్ మాల్లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. ఈ మేరకు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేశారు.
మంటలు భారీగా ఎగిసిపడుతుండడంతో అదుపు చేయడం కష్టంగా మారింది. దాంతో అగ్నిమాపక సిబ్బంది పక్క షాపుల వారిని ఖాళీ చేయించారు. అయితే షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉంటుంది అని అంత భావిస్తున్నారు.
అయితే ఈ ప్రమాదంలో ఇప్పటి సుమారు రూ. 6 కోట్ల రూపాయల విలువైన సామగ్రి కాలిబూడిదైందని మాల్ నిర్వాకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ALSO READ: కేసీఆర్ కు గాయం… యశోద ఆస్పత్రిలో చికిత్స