భారత్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. మంగళవారం జరిగిన రెండో మ్యాచ్ల్లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది (South Africa defeats India).
ఇండియా: 180-7 (19.3 ఓవర్లు)
దక్షిణాఫ్రికా : 154-5 (13.5 ఓవర్లు) విజేత
IND Vs SA 2nd T20:
తొలుత టాస్ ఓడి బాటింగ్ కు దిగిన ఇండియా… 19.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేయగలిగింది. ఇండియా బ్యాటర్లలో రింకు సింగ్ మరియు సూర్య కుమార్ యాదవ్ చెరో అర్ధ శతకం చేసుకున్నారు.
ఓపెనర్ రుతురాజ్ అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్ కి అందుబాటులో లేడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కొయెట్జి కు మూడు వికెట్ లు దక్కాయి. అయితే ఇండియా ఇన్నింగ్స్ 19.3 ఓవర్ల దగ్గర ఉన్నపుడు వర్షం కారణంగా మ్యాచ్ కాసేపు ఆగింది.
అనంతరం డెక్వర్థ్ లూయిస్ ప్రకారం లక్ష్యాన్ని 15 ఓవర్లలో 152 పరుగులకు నిర్దేశించారు. 152 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 13.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో హెన్డ్రిక్స్ 49 పరుగులు, మార్కరం 30 పరుగులతో టీం కు విజయాన్ని అందించారు.
ఇండియా బౌలర్లలో ముకేష్ రెండు వికెట్లు తీయగా… కుల్దీప్ మరియు సిరాజ్ చెరో వికెట్ తీసుకున్నారు.
ప్లేయర్ అఫ్ ది మ్యాచ్:
ష్యామ్సి-(4 ఓవర్లు 18 పరుగులు 1 వికెట్)
దక్షిణాఫ్రికా గెలుపు (South Africa defeats India):
South Africa defeated India by 4 wickets in the 2nd T20I.
– Chase down 152 runs from 13.5 overs….!!!!! pic.twitter.com/AoENNBZlZF
— Johns. (@CricCrazyJohns) December 12, 2023
ALSO READ: World Cup 2023: న్యూజీలాండ్ చేతిలో కంగుతిన్న నెదర్లాండ్స్