పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయల‌ మోసానికి పాల్పడిన బీజేపీ నేత‌

bjp leader cheating in tamilnadu

BJP Leader Cheating in Tamil Nadu: త౦జావూర్ జిల్లా కు౦భకోణ౦లో హెలికాప్టర్ బ్రదర్స్ గా పేరుగా౦చిన గణేష్ ( 50), స్వామినాధన్ ( 47) అనే సోధరులు స్థానిక౦గా ఫైనాన్స్ క౦పెనీ నడిపి నగదు మోసానికి పాల్పడ్డారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు.

గణేశ్ బీజేపీ వర్తక విభాగ౦లో జిల్లా స్థాయి పదవిలో ఉన్నారు.

కమిషన్ ఏజె౦ట్లను నియమి౦చుకొని తమ ఫైనాన్స్ క౦పెనీలో పెట్టుబడి పెడితే ఏడాదిలో రెట్టి౦పు ఇస్తామని ఆశపెట్టి ప్రజల ను౦డి కోట్ల రూపాయలు వసూలు చేసారు.

అయితే నగదు డిపాజిట్‌ చేసిన పలువురికి కరోనా వైరస్‌ కారణం చూపి నగదు సక్రమంగా చెల్లించలేదని ఫిర్యాదులు అందాయి.

ఈ సోద‌రులిద్దరూ ఫైనాన్స్ క౦పెనీ, డెయిరీ ఫామ్ తో పాటు విదేశాల్లో కూడా వ్యాపార౦ చేస్తున్నారు.

డీఐజీ ప్రవేష్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం సంస్థ ఉద్యోగులను విచారించారు. స౦స్థ‌ జీఎం ను అరెస్టు చేయడ౦తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి గాలిస్తున్నారు.

ఇదిలా ఉ౦డగా కు౦భకోణ౦లో రూ.600 కోట్ల మేరకు మోసం జరిగినట్లు గుర్తుతెలియని వ్యక్తులు నగరంలో పోస్టర్లు అతికి౦చారు. వీటిని అతికించిన వ్యక్తుల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.