ప్రముఖ తెలుగు నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు (Ex Minister Babu Mohan joins Praja Shanthi Party). కొద్ది రోజుల క్రితం బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన బాబు మోహన్ నేడు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ (Ka Paul) సమక్షంలో పార్టీలో చేరారు.
ఈ నేపథ్యంలో… రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ నుంచి ప్రజాశాంతి పార్టీ తరపున బాబు మోహన్ పోటీ చేస్తున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ తెలిపారు. అయితే గతంలో తాను పనిచేసిన పార్టీలలో విలువలు లేకపోవడంతోనే తాను ప్రజాశాంతి పార్టీలో చేరినట్లు బాబు మోహన్ ప్రకటించారు.
ఇకపోతే రానున్న ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరఫున వరంగల్ నుంచి పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని… తనకు అన్ని వర్గాల మద్దతు చేకూరిస్తే తప్పక విజయం సాధిస్తానని బాబు మోహన్ పేర్కొన్నారు.
పాల్ పార్టీలోకి బాబు మోహన్ (Babu Mohan joins Praja Shanthi Party in the presence of Ka Paul):
Babu Mohan joined K A Paul’s Praja Shanti Party pic.twitter.com/sq6yLuLxSX
— Naveena (@TheNaveena) March 4, 2024
#KAPaul ఆధ్వర్యంలో ప్రజాశాంతి పార్టీలో చేరిన #BabuMohan.
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్ నుంచి బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారు అని తెలిపిన ప్రజా శాంతిపార్టీ అధ్యక్షులు KA పాల్.
గతంలో పనిచేసిన పార్టీలో విలువ లేకనే తాను ప్రజాశాంతి పార్టీలో చేరినట్లు… pic.twitter.com/jv7OYUC3Tg
— Gulte (@GulteOfficial) March 4, 2024
Actor, #BJP leader and former minister #BabuMohan who resigned BJP, joined Praja Shanti Party in the presence of party chief @KAPaulOfficial and got a ticket to contest as MP candidate from Warangal.#LokSabhaElections2024 #Telangana#KAPaul pic.twitter.com/sbLpHSO1Eq
— Surya Reddy (@jsuryareddy) March 4, 2024
ALSO READ: ఈసారి జగన్ కు ఓటమి తప్పదు: ప్రశాంత్ కిషోర్