తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది (Congress Won Telangana Elections 2023). 119 అసెంబ్లీ స్థానాలకు గాను జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలను గెలుచుకోగా… బీఆర్ఎస్ 39 స్థానాలు , బీజేపీ 8 స్థానాలు, ఎంఐఎం 7 స్థానాలు అలాగే ఇతరులు 1 స్థానాన్ని గెలుచుకున్నారు.
ఇదిలా ఉండగా… తెలంగాణ రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రంలో తొలిసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం గమనార్హం. మార్పు కావలి… కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో తెలంగాణ ఎన్నికల్లో దిగిన కాంగ్రెస్… రాష్ట్రంలో తమ ఆధిపత్యాన్ని సొంతంచేసుకుంది. దీంతో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం ఆశలు ఆవిరయ్యాయి.
అయితే తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో… ఇప్పుడు అందరి దృష్టి అభివృద్ధి మరియు ప్రతిస్పందనాత్మక పాలనతో కూడిన భవిష్యత్తు వైపు రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తుంది అనే దానిపైనే ఉంది.
After the completion of the counting of votes for Telangana Assembly Elections, Congress won 64 seats, Bharat Rashtra Samithi won 39 seats, Bharatiya Janata Party won 8 seats & AIMIM won 7 seats pic.twitter.com/ollROeGBmF
— ANI (@ANI) December 3, 2023
ALSO READ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2023