CM Breakfast Scheme: విద్యార్థులతో పాటు కేటీఆర్ బ్రేక్ ఫాస్ట్

Date:

Share post:

CM Breakfast Scheme: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త. సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం ఈ రోజు ఉదయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. తెలంగాణలోని సర్కారు బడులలో చదువుతున్న విద్యార్థుల కోసం (సీఎం అల్పాహార పథకం) ఒక వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన పౌష్ఠికాహారాన్ని అందించడంతో పాటు… వారంతా చదువు పై దృష్టి సారించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని తీసుకొచ్చారు.

ఈ రోజు ఉదయం సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పరిధిలోని వెస్ట్‌మారేడుపల్లి ప్రభుత్వ పాఠశాలలో మంత్రి కేటీఆర్ గారు ఈ అల్పాహార పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా, సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం ప్రారంభించి… విద్యార్థులకు తానే స్వయంగా వడ్డించి వారితో కలిసి బ్రేక్ ఫాస్ట్ తిన్నారు మంత్రి కేటీఆర్.

సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం మెనూ: (CM Breakfast Scheme Menu)

సోమవారం: ఇడ్లీ, సాంబర్ లేదా గోధుమ రవ్వ ఉప్మా
మంగళవారం: పూరి, ఆలూ కూర్మ లేదా టమాట బాత్
బుధవారం: ఉప్మా, సాంబార్ లేదా కిచిడీ, చట్నీ
గురువారం: మిల్లెట్స్, ఇడ్లీ, సాంబార్ లేదా పొంగల్, సాంబార్
శుక్రవారం: ఉగ్గాని లేదా పోహా మిల్లెట్ ఇడ్లీ, చట్నీ లేదా గోధుమ రవ్వ, కిచిడీ
శనివారం: పొంగల్ సాంబార్ లేదా వెజిటేబుల్ పలావ్.

Minister for IT, Industries, MA & UD, Telangana tweet:

ALSO READ: విశాఖపట్నంలో పరుగులు తీయనున్న మెట్రో రైలు… శంకుస్థాపన ఖరారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

వచ్చేది కారు.. ఏలేది సారూ.. అతనే మన కేసీఆర్- మ‌ల్లారెడ్డి

Malla Reddy Medchal Public Meeting: తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ప్రచారాలు...

బీఆర్‌ఎస్‌లో చేరిన పొన్నాల లక్ష్మయ్య… కాంగ్రెస్ కు షాక్

Ponnala Lakshmaiah Joins BRS: తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరవుతున్న తరుణంలో కాంగ్రెస్ కు గట్టి ఎదురు దెబ్బె తగిలింది. జనగామలో...

తెలంగాణ: 9 కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభించిన కేసీఆర్

New Medical Colleges in Telangana: తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం రాష్ట్రం లో...

రాయిదుర్గ్ – శంషాబాద్ విమానాశ్రయం కు మెట్రో రైలు: రూ. 6,250 కోట్లు ఖర్చు

Hyderabad Metro Corridor extending from Raidurg Metro terminal to Shamshabad International Airport. హైదరాబాద్ నగరవాసులకు శుభవార్త. మైండ్ స్పేస్...

నిరుద్యోగులకు కేసీఆర్ వరాలు జల్లు, 95 శాత౦ లోకల్ వాళ్ళకే

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ 2022 సమావేశాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భారీగా ఉద్యోగాల‌ భర్తీ ప్రకటనను వెల్లడించారు. రాష్ట్ర౦లో మొత్తం 91, 142...

గా౦ధీలో కరోనా పేషె౦ట్లను నేరుగా కలిసి ధైర్యాన్నిచ్చిన సీఎ౦ కేసీఆర్

ప్రభుత్వ దవాఖానాల్లో కోవిడ్ చికిత్స విధానాన్ని పరిశీలించేందుకు, కరోనా పేషెంట్లకు భరోసానిచ్చేందుకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఇవాళ గాంధీ దవాఖానాను...

తెల౦గాణాలో లాక్డౌన్ వల్ల ఉపయోగమేమీ లేదు: సీఎ౦ కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించడం వలన ప్రజాజీవనం...