నిరుద్యోగులకు కేసీఆర్ వరాలు జల్లు, 95 శాత౦ లోకల్ వాళ్ళకే

Date:

Share post:

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ 2022 సమావేశాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భారీగా ఉద్యోగాల‌ భర్తీ ప్రకటనను వెల్లడించారు. రాష్ట్ర౦లో మొత్తం 91, 142 ఉద్యోగాలకు నేటి నుంచే భర్తీ ప్రక్రియ ప్రారంభం చేస్తున్నట్లు ప్రకటించారు. తమది ఎంప్లాయింట్‌మెంట్‌ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌ అని, దేశ౦లోనే అత్యధిక వేతనాలు తీసుకు౦టున్నవారు తెలంగాణ ఉద్యోగులు అని సీఎం కేసీఆర్ తెలిపారు.

టీఆర్‌ఎస్‌కు రాజకీయాల౦టే ఒక టాస్క్

వేరే పార్టీలకు రాజకీయాలంటే గేమ్… టీఆర్‌ఎస్‌కు మాత్రం ఒక టాస్క్‌. ఈ రాష్ట్రం తెచ్చిన వాళ్లం మేం. మేం ఏం చేశామో ప్రజలకూ తెలుసు. పోరాటాలు చేశాం. జైలుకు వెళ్లాం. వ్యక్తిగత నిందలు ఎదుర్కొన్నా. ఏకాగ్రత, లక్ష్యం దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ఊరుకున్నాం. తెలంగాణ కోసం క్షోభ, బాధ అనుభవించాం. తెలంగాణ భాష అంటే ఒకప్పుడు హాస్యాస్పదంగా ఉండేది. సినిమాల్లో ఒకప్పుడు జోకర్లకు ఉండే తెలంగాణ యాస… ఇప్పుడు హీరోలకు వచ్చి౦ది అని సీఎ౦ కేసీఆర్ అన్నారు.

95 శాత౦ స్థానికులకే

దేశ౦లోనే అతి తక్కువ అప్పులు ఉన్న రాష్ట్ర౦ తెల౦గాణ. దేశంలో ఎక్కడా లేని విధంగా 95 శాతం రిజర్వేషన్లను స్థానికుల వర్తి౦పజేస్తున్నా౦. అటె౦డర్ ను౦చి ఆర్డీఓ దాకా 95% రిజర్వేషన్ స్థానిక అభ్యర్దులకే ఉ౦టు౦ది. కా౦ట్రాక్టు ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు ప్రకటి౦చారు. ఇకపై కా౦ట్రాక్టు ఉద్యోగాలు ఉ౦డవు అని సీఎ౦ కేసీఆర్ అన్నారు.

ఉద్యోగార్దుల‌ గరిష్ట‌ వయోపరిమిత పె౦పు

పోలీసు సర్వీసు లా౦టి యూనిఫా౦ సర్వీసులను మినహాయి౦చి, ఇతర ఉద్యోగాలకు గ‌రిష్ట వయోపరిమితిని పదేళ్లకు పెంచుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే సర్వీసులో ఉన్న‌ 11, 103 కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణలో మొత్త౦ గుర్తించిన ఖాళీలు 91, 142

గ్రూప్‌-1 పోస్టులు 503

గ్రూప్‌-2 పోస్టులు 582

గ్రూప్‌-3 పోస్టులు 1,373

గ్రూప్‌-4 పోస్టులు 9,168

జిల్లా స్థాయిలో 39, 829 పోస్టులు.

జోనల్‌ లెవల్‌లో 18, 866 పోస్టులు

మల్టీజోనల్‌లో 13, 170 ఉద్యోగాల ఖాళీ

ఇతర కేటగిరీ, వర్సిటీల్లో 8, 174 పోస్టులు

నిరుద్యోగుల జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించడంతో పాటు మొత్తం ఖాళీలలో.. 80, 039 పోస్టులకు ఈరోజు (మార్చి 9, 2022) నుంచే నోటిఫికేషన్లు జారీ అవుతాయని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

UPSC చైర్మన్ మనోజ్ సోని రాజీనామా

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చైర్మన్ మనోజ్ సోని (UPSC Chairman Manoj Soni resigned) రాజీనామా చేశారు. అయితే ఆయన...

Manolo Marquez: భారత్ ఫుట్‌బాల్ కోచ్ గా మ‌నొలొ మార్కెజ్‌

భారత్ పురుషుల ఫుట్‌బాల్ కోచ్ గా స్పెయిన్ ఫుట్‌బాల్ జ‌ట్టు మేనేజ‌ర్ మ‌నొలొ మార్కెజ్‌ నియమితులు (New India Football Head Coach...

Viral Video: విద్యుత్ సిబ్బంది పై దాడి చేసిన యువకుడు

హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. సనత్ సాగర్ పరిథిలో పెండింగ్ లో ఉన్న కరెంటు బిల్లు కట్టమని అడిగినందుకు విద్యుత్ సిబ్బంది పై...

Group 2 postponed: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షను వాయిదా (Telangana TGPSC Group 2 Exam Postponed)...

Womens Asia Cup T20 2024: నేడు భారత్ తో పాక్ పోరు

నేటి నుంచి మహిళా ఆసియ కప్ టీ20 2024 (Womens Asia Cup T20 2024) ప్రారంభం. ఈ టోర్నమెంట్ లో భాగంగా...

కాంగ్రెస్ లో చేరిన పఠాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే

బీఆర్​ఎస్​ పార్టీకి మరోసారి ఊహించని షాక్ తగిలింది. పఠాన్ చెరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు...

గుజరాత్ లో ఘోర ప్రమాదం… ఆరుగురు మృతి

గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుసేసుకుంది. నదియాడ్‌లో అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్‌ వేపై వేగంగా వెళ్తున్న ట్రక్కు బస్సును ఢీకొటింది (Gujarat Ahmedabad-Vadodara...

ఐదో టీ20లో భారత్ విజయం… సిరీస్ కైవసం

IND vs ZIM 5th T20: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకున్న భారత్. ఆదివారం జింబాబ్వేలోని హరారే...

జింబాబ్వే చిత్తు… రెండో టీ20లో భారత్ విజయం

జింబాబ్వేలోని హారరే వేదికగా నిన్న (IND vs ZIM 2nd T20) మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో 100 పరుగుల...

బీఆర్ఎస్ కు షాక్… కాంగ్రెస్ లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు

బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల గురువారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి (Six...

Laila: ‘లైలా’ గా మారిన విశ్వక్ సేన్

మాస్ కా దాస్ "విశ్వక్ సేన్" మరోసారి ప్రయోగం చేయనున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ లో రామ్ నారాయ‌ణ్ డైరెక్ష‌న్ లో ‘లైలా’...

టీ20కు రిటైర్మెంట్ ప్రకటించిన టీం ఇండియా స్టార్ ప్లేయర్లు

భారత్ క్రికెట్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. టీమిండియా స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20...