తక్కువ రేటుకే పెట్రోల్ కావాల౦టే ఆఫ్గనిస్తాన్ వెళ్ళి పోయి౦చుకో౦డి

bjp leader ramratan payal

పెట్రోల్ ధరలపై ప్రశ్నించిన రిపోర్టర్ ని తాలిబాన్ పాలిత ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్లండి అని మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చె౦దిన‌ బీజేపీ నాయకుడు రామరతన్ పాయల్ అన్నారు.

కరోనా వైరస్ థర్డ్ వేవ్ రాబోతున్న సమయంలో ఇంధన ధరల గురించి ప్రశ్నలు అడిగినందుకు జర్నలిస్ట్‌పై నిప్పులు చెరిగారు.

తాలిబాన్‌కు వెళ్లండి. ఆఫ్ఘనిస్తాన్‌లో పెట్రోల్ లీటరు రూ. 50/‍ కే దొరుకుతు౦ది. అక్కడకు (ఆఫ్ఘనిస్తాన్) వెళ్ళి పెట్రోల్ ని౦పుకో౦డి, అక్కడ‌ ఇంధనాన్ని రీఫిల్ చేయడానికి ఎవరూ లేరు అని అన్నారు.

దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీరు గ్రహించలేదా? మోడీజీ పరిస్థితిని ఎలా నియంత్రిస్తున్నారు. ఇప్పటికీ 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నారు అని వ్యాఖ్యాని౦చారు.