Aryan Khan gets Bail: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు బా౦బే హైకోర్టు ఈ రోజు బెయిల్ మంజూరు చేసి౦ది. ఆర్యన్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ, ఎన్సీబీ తరపు న్యాయవాదుల వాదనలను విన్న హైకోర్టు ఆర్యన్‌తో పాటు మరో ఇద్దరికి బెయిల్ ఇచ్చింది. ఆర్యన్ రేపు ( శుక్రవార౦) జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
అక్టోబర్ 2వ తేదీ అర్థరాత్రి క్రూయిజ్ షిప్ డ్రగ్స్ పార్టీలో పోలీసులు ఆకస్మిక దాడులు చేసి ఆర్యన్‌తో పాటు మరో 8మందిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆర్యన్ దాదాపు 23 రోజుల పాటు జైలులోనే ఉన్నాడు. అతడి బెయిల్ పిటిషన్‌కు ముంబై కోర్టు మూడు స్లార్లు కొట్టివేసింది. దీంతో ఆర్యన్ బాంబే హైకోర్టును ఆశ్రయించగా చివరికి అతడికి బెయిల్ లభించింది.