మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తన సొంత గూటీకి చేరుకున్నారు. దీంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. మంగళవారం మధ్యాహ్నం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆళ్ల రామకృష్ణా రెడ్డి మళ్లీ వైసీపీ పార్టీలో చేరారు (Alla Ramakrishna Reddy joins YSRCP).
పార్టీ చేరిన అనంతరం ఆళ్ల రామకృష్ణా రెడ్డి మీడియా తో మాట్లాడుతూ… పేదలకు మంచి జరగకుండా విపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయ్ అని… విపక్షాల ప్రయత్నాన్ని తిప్పికోటేందుకే తాను తిరిగి వైసీపీ పార్టీ లో చేరాలని నిర్ణయించుకున్నాయి అని ఆర్కే స్పష్టం చేశారు.
అలాగే మంగళగిరిలో ఏ అభ్యర్థికి సీటు ఇచ్చినా వైసీపీ ప్రభుత్వం గెలుపు కోసం కృషి చేస్తానంటూ చెప్పుకొచ్చారు. ఇకపోతే మంగళగిరి లో నారా లోకేష్ కు ఈసారి ఎన్నికల్లో కూడా ఓటమి తప్పదని ఆర్కే ఎద్దేవా చేశారు.
వైసీపీ లో చేరిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి (Alla Ramakrishna reddy Re Joins YSRCP):
మంగళగిరిలో ఏ అభ్యర్థికి సీటు ఇచ్చినా…@YSRCParty గెలుపు కోసం కృషి చేస్తా..
-మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే#YSRCP #YSJaganAgain pic.twitter.com/B9IMmutgrt
— YSR Congress Party (@YSRCParty) February 20, 2024
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి. తిరిగి @YSRCPartyలో జాయిన్ అయిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే.#YSRCP #YSJaganAgain pic.twitter.com/UUmbcgWeJL
— YSR Congress Party (@YSRCParty) February 20, 2024
ALSO READ: లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎక్సిక్యూటివ్ ఇంజినీర్