ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (Ramoji Rao passed away) కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. ఈనెల 5వ తేదీన అస్వస్థతకు గురైన రామోజీరావు గారు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ శనివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు.
రామోజీ రావు మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రామోజీ రావు అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం రామోజీ రావు పార్థివదేహాన్ని రామోజీ ఫిలిం సిటీకి తరలించినట్లు తెల్సుతోంది.
రామోజీరావు మృతి (Ramoji Rao Died) పట్ల పలువురు సినీ ప్రముఖులు, నిర్మాతలు, వ్యాపారవేత్తలు, రాజకీయనాయకులు నివాళులు తెలిపారు.
Chandrababu Naidu Tweet:
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన శ్రీ రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసింది అంటూ చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా నివాళులు తెలిపారు.
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన శ్రీ రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. అక్షర యోధుడుగా శ్రీ రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారు. తెలుగు వారి… pic.twitter.com/jYHQDFJdxF
— N Chandrababu Naidu (@ncbn) June 8, 2024
Narendra Modi Tweet:
రామోజీరావు మృతి పట్ల నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు రామోజీ గారు అని. పత్రిక, సినీ, వ్యాపార రంగాలపై చెరగని ముద్ర వేసిన ఆయన అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది అని మోదీ పేర్కొన్నారు.
The passing away of Shri Ramoji Rao Garu is extremely saddening. He was a visionary who revolutionized Indian media. His rich contributions have left an indelible mark on journalism and the world of films. Through his noteworthy efforts, he set new standards for innovation and… pic.twitter.com/siC7aSHUxK
— Narendra Modi (@narendramodi) June 8, 2024
రామోజీ రావు కన్నుమూత (Ramoji Rao Passed Away):
Eenadu & Ramoji Film City founder Ramoji Rao, passed away today morning in Hyderabad, Telangana.
Ramoji Rao died while undergoing treatment at Star Hospital in Hyderabad. He took his last breath at 3:45 am. pic.twitter.com/DJGufYRtMP
— ANI (@ANI) June 8, 2024
ALSO READ: ఏపీ కొత్త సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ నియామకం