బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు (Harish Rao Comments on Kadiyam Srihari). బీఆర్ఎస్ పార్టీకి కడియం శ్రీహరి ద్రోహం చేశారని హరీష్ (Harish Rao Fires on Kadiyam Srihari) మండిపడ్డారు.
బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన హరీశ్‌రావు మాట్లాడుతూ… పార్టీని వదిలి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరికి గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు.
అలాగే ఎన్‌టీఆర్, చంద్రబాబు, కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కడియం శ్రీహరి అని హరీష్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ కడియంకు ఉప ముఖ్యమంత్రిగా, ఎంపీగా, రెండు సార్లు ఎమ్మెల్సీగా పార్టీ అవకాశం ఇచ్చిందని… అయితే అసలు ఆయన పార్టీ ఎందుకు మారారో? చెప్పాలని హరీశ్‌రావు కోరారు.
ఇకపోతే గడిచిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే పదవికి ఆయన వెంటనే రాజీనామా చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేసినట్లు సమాచారం.
బీఆర్ఎస్ కు కడియం ద్రోహం చేశారు (Harish Rao Comments on Kadiyam Srihari):
కడియం శ్రీహరి పార్టీకి ద్రోహం చేశారు : Harish Rao – TV9#harishrao #kadiyamsrihari #telanganapolitics #tv9telugu pic.twitter.com/4Iv9kg6xkV
— TV9 Telugu (@TV9Telugu) April 1, 2024
కడియం శ్రీహరి వెళ్లిపోయాక పార్టీలో జోష్ కనిపిస్తోంది.. కడియంకు గుణపాఠం చెప్పాలనే కసి కార్యకర్తల్లో కనిపిస్తోంది.. తన కుమార్తెకు టికెట్ అడిగి.. కడియం చివరి నిమిషంలో ద్రోహం చేశారు.. పార్టీ ఎందుకు మారారో చెప్పాలి.. పార్టీ ద్వారా వచ్చిన పదవికి కడియం రాజీనామా చేయాలి-హరీష్‌రావు…
— NTV Breaking News (@NTVJustIn) April 1, 2024
ALSO READ: YS Sharmila: కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల..!