మహాలక్ష్మి పథకంలోని (Mahalakshmi Scheme) రూ.500కే గ్యాస్ సిలిండర్ (500 Rs Gas Cylinder) స్కీమ్‌ను తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ప్రారంభిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ఈ పధకాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రూ. 500 గ్యాస్ పథకానికి సంబంధించి గైడ్‌లైన్స్ (Mahalakshmi Scheme Guidelines) ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
నిబంధనల (Mahalakshmi Scheme Guidelines):
- మహాలక్ష్మి పథకం పొందాలంటే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఉండాలి
- తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి
- మహిళా పేరుతో గ్యాస్ కనెక్షన్ ఉండాలి
- గత మూడేళ్ళుగా సిలిండర్ వినియోగిస్తూ ఉండాలి అని ప్రభుత్వం సూచించింది.
మహాలక్ష్మి పథకం గైడ్‌లైన్స్ విడుదల చేసిన ప్రభుత్వం
రూ. 500 గ్యాస్ సిలిండర్ కావాలంటే
తెల్లరేషన్ కార్డు ఉన్నవాళ్లకు మాత్రమే మహాలక్ష్మి పథకం వర్తింపు.
ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారే పథకానికి అర్హులు.
మహిళ పేరుపై గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి మహాలక్ష్మి పథకం. pic.twitter.com/4jNjl4OWrL
— Telugu Scribe (@TeluguScribe) February 27, 2024
ALSO READ: తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కే. శ్రీనివాస్ రెడ్డి నియామకం