ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు సోమవారం హాజరు కాలేనంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐకి లేఖ రాశారు (MLC Kavitha letter to CBI). సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను ఇవ్వడం సబబు కాదని… దానిని వెంటనే రద్దు చేయండి లేదా ఉపసంహరించుకోవాలని సూచించారు.
ముందే నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్న రీత్య… ఈ నెల 26న సిబిఐ విచారణకు హాజరుకావడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఒకవేళ తననుంచి సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాధానం మరియు సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటాననని కవిత అన్నారు.
ఇకపోతే గతం లో (2022) సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చారు అని… ఇప్పుడు సెక్షన్ 41ఏ నోటీసు పంపించారని. ఇది పూర్తిగా విరుద్ధం అని కవిత రాసుకొచ్చారు.
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల రానున్న నేపథ్యంలో, 6 వారాల పాటు పార్టీ సమావేశాల్లో పాల్గొంటానుని… ఈ రీత్యా ఫిబ్రవరి 26వ తేదీన విచారణకు హాజరుకాలేనని కవిత తెలిపారు. అలాగే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో జారీ చేసిన నోటీసులను నిలిపివేతకు పరశీలించాలని కోరారు.
సీబీఐకి కవిత లేఖ (MLC Kavitha letter to CBI):
BRS MLC Kavitha letter to CBI
I may request you to firstly revoke or withdraw the subject Notice as it appears to be sent by invoking Section 41A Cr.P.C. while not being aware or conscious of the earlier Notice sent under Section 160 Cr.P.C.
In the light of my pressing onerous…
— Naveena (@TheNaveena) February 25, 2024
విచారణకు రాను – సీబీఐకి కవిత లేఖ
ఢిల్లీ లిక్కర్ స్కాంలో 26న విచారణకు హాజరు కాను
సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు కరెక్ట్ కాదు
2022 డిసెంబరులో సెక్షన్ 160 కింద నోటీసు
ఇప్పుడు సెక్షన్ 41ఏ కింద ఎందుకు ?
ఎన్నికల ప్రచారం ఉన్నందున ఢిల్లీకి రావడం కుదరదు !
విచారణకు… pic.twitter.com/8Y65dcxtmA
— Telugu360 (@Telugu360) February 25, 2024
ALSO READ: వైసీపీ కి రఘురామకృష్ణరాజు రాజీనామా