ఆదివారం జరిగిన U19 ప్రపంచకప్ ఫైనల్ (Under 19 World Cup Final) లో డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ 79 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది (Australia beat India in U19 WC Final) .
తొలుత బ్యాట్టింగ్ కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 253 పరుగులు చేశారు. ఆసీస్ బ్యాటర్లలో హర్జస్ సింగ్ 55 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా… కెప్టెన్ హ్యు వెబ్జెన్ 48 పరుగులు ,ఒలివర్ పీక్ 46 పరుగులు, హ్యారీ డిక్షన్ 42 పరుగులతో మెరిశారు.
భారత బౌలర్లలో రాజ్ లింబాని 3 వికెట్లు తీసుకోగా… నామన్ తివారి రెండు వికెట్లు దక్కించుకున్నారు.
అనంతరం 254 పరుగుల లక్ష్యంతో బ్యాట్టింగ్ కు దిగిన భారత్ ఏ దశలోనూ కుదురుకున్నట్లు కనిపించలేదు. ఆసీస్ బౌలర్ల ధాటికి క్రమంలో ముఖ్య వికెట్లను కోల్పోతూ వచ్చింది. ఓపెనర్లు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు చేతులు ఏతేయడంతో భారత్ విజయావకాశాలు సన్నగిల్లాయి.
అయితే అభిషేక్ కొద్దిసేపు ప్రతార్థి పై ఎదురు దాడి చేసాడు. బౌండరీలతో ఆసీస్ బౌలర్లకు సమర్ధవంతంగా ఎదురుకున్నాడు. అయితే అప్పటికే భారత్ ఓటమి ఖరారు అయిపోయింది. చివరకు భారత్ 43.5 ఓవర్లలోనే 174 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది.
దీంతో అండర్ 19 ప్రపంచకప్ ను ఆస్ట్రేలియా సొంతం చేసుకుంది. అంతేకాదు అండర్ 19 ప్రంపంచకప్ ఫైనల్ (U19 World Cup Final) లో భారత్ పై ఆస్ట్రేలియా నెగ్గడం ఇదే తొలిసారి. 2012, 2018 లో ఈ రెండు జట్టు ఫైనల్ లో తలపడగా రెండు సార్లు భారత్ ఏ గెలిచింది. దీంతో భారత్ మూడో సారి ఆస్ట్రేలియా పై గెలిచి హ్యాట్రిక్ కల చేజారింది.
భారత్ ఓటమి (Australia beat India in U19 World Cup Final):
Another loss for Team India in the Final to Australia
India's Under-19 boys impressed one and all but couldn't beat Australia
After the World Test Championship and the Cricket World Cup, this is the third final of an ICC tournament India has lost to Australia. pic.twitter.com/WGPBWO1GYb
— Star Sports (@StarSportsIndia) February 11, 2024
ALSO READ: Jasprit Bumrah: భారత పేసర్ బుమ్రా సరికొత్త రికార్డు