ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నేడు ఢిల్లీ లో దీక్ష చేపట్టనున్నారు (YS Sharmila Protest in Delhi on Special Status). ఇవాళ ఉదయం 10 గంటలకు జంతర్ మంతర్ వద్ద ఆమె దీక్ష ప్రారంభం కానున్నట్లు సమాచారం.
రాష్ట్రంలోని పరిస్థితులని జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్లాలని… అలాగే విభజన చటంలోని హామీలను అమలు చేయాలనీ వై ఎస్ షర్మిల డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఏపీసీసీ చీఫ్ గా పదవి భాద్యతలు చేపట్టిన వై ఎస్ షర్మిల ఏపీలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇందులో భాగంగానే వచ్చే ఎన్నికలలో ప్రజలను ఆకట్టుకోవడం కోసం మరియు ప్రజా మద్దతును కూడగట్టడం కోసం ప్రత్యేక హోదా అంశాన్ని రాష్ట్రవ్యాప్తంగా జోరుగా ప్రచారం చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఢిల్లీలో షర్మిల దీక్ష (YS Sharmila Protest in Delhi on Special Status):
ఢిల్లీ గడ్డపై షర్మిల దీక్ష | YS Sharmila Delhi Tour | Prime9 News#YSSharmila #congressparty #YSJagan #YCPParty #politics #BurningIssue #Delhi #BreakingNews #LatestNews #TeluguNews #Prime9News
Watch Video >>https://t.co/wnk4jEsMQf pic.twitter.com/Rv0l9xZkap
— Prime9News (@prime9news) February 1, 2024
ALSO READ: వైసీపీ ఇన్‌ఛార్జుల ఐదో జాబితా విడుదల