నేడు విశ్వవిఖ్యాత సీనియర్ ఎన్టీఆర్ 28 వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించడంతో (Jr NTR Flexi removed at NTR Ghat)రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.
గురువారం తెల్లవారుజామున జూనియర్ ఎన్టీఆర్ మరియు నందమూరి కల్యాణ్‌రామ్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. తమ అభిమాన నాయకుడు వారు వస్తున్నారన్న విషయం తెలుసుకున్న అభిమానులు అప్పటికే ఎన్టీఆర్ ఘాట్ వద్ద పెద్ద పెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
#JrNTR and #NandamuriKalyanram visited NTR Ghat and paid respects on NTR's 28th Vardhanthi. pic.twitter.com/SEb3pDz6eH
— Gulte (@GulteOfficial) January 18, 2024
అనంతరం నందమూరి బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని తన తండ్రి సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
#WATCH | Actor #NandamuriBalakrishna visits NTR ghat and pays tributes to the former CM of undivided #AndhraPradesh CM and Telugu film actor #NTR on his 28th death anniversary
📹: ANI pic.twitter.com/fdSJOIqiZn
— Hindustan Times (@htTweets) January 18, 2024
అయితే బాలకృష్ణ అక్కడ నుంచి వెళ్లిన కొద్దిసేపటికే ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అన్నింటినీ అనూహ్యంగా తొలగించడం జరిగింది.
“తీయించేయి … వెంటనే తీయించేయి”:
జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించడంతో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా ఇప్పుడు ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ వీడియో వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ వీడియో లో బాలకృష్ణ “తీయించేయి … వెంటనే తీయించేయి” అంటున్నట్లు ఉన్న వీడియో వైరల్ అవుతోంది.
NTR Ghat lo @tarak9999 ఫ్లెక్స్ లు తొలగించమని ఆదేశించిన బాలయ్య. 😳
pic.twitter.com/tGCqWzroC4— YS Jagan Trends ™ (@YSJaganTrends) January 18, 2024
దీనికి తోడుగా బాలకృష్ణ అక్కడ నించే వెళ్లిపోయిన అనంతరం జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించడంతో నందమూరి కుటుంబంలో విబేధాలు బయటపడ్డాయంటూ చేర్చలు మొదలయ్యాయి. అంతేకాదు టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటోన్న విషయం అయితే తెల్సిందే.
తారక్ ఫ్లెక్సీలు తొలగింపు (Jr NTR Flexi Removed):
It's unfair if the #NTR cutouts have been removed from NTR ghat, and it could potentially harm the reputation of the party. A more equitable solution should be sought.pic.twitter.com/4yEe5aT1JR
— CHITRAMBHALARE (@chitrambhalareI) January 18, 2024
మరి బాలకృష్ణ ఆ మాటలు ఫ్లెక్సీలను ఉదీసించి అన్నవా..? లేదా అది కల్పిత వీడియో నా..? అన్నది తెలియాల్సి ఉంది.
ALSO READ: మెగాస్టార్ కు పద్మవిభూషణ్..?