Free Bus Travel for Woman: తెలంగాణ మహిళలకు శుభవార్త. కాంగ్రెస్ ఎన్నికల హామీలో భాగంగా… రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం ఈ నెల 9 నుంచి అమలుకానుంది. ఇందుకుగాను మహిళలు తమ ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుందని అధికారులు పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో తాము ఇచ్చిన హామీలను నిర్వహించే విధంగా అడుగులు వేస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి… మంత్రివర్గ సమావేశం అనంతరం ఆ సమావేశంలో చర్చించిన అంశాలను మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చినా ఆరు గ్యారెంటీల్లో ముందుగా రెండు గ్యారెంటీలను అమలు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి శ్రీధర్ తెలిపారు.
ఇందులో భాగంగా ఈనెల 9వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ (Free Bus Travel) సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. మరియు ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ. 10 లక్షలకు పెంచుతున్నట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు.
సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా… డిసెంబర్ 9 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరూ ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (Free Bus Travel for Woman in Telangana)
Free bus travel for Women from December 9
డిసెంబర్ 9 నుంచి మహిళలకు ఉచ్చిత బస్సు ప్రయాణం
మహిళలకు రాష్ట్రంలో ఉచిత బస్సు రవాణా సౌకర్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ రూ.10 లక్షల వరకు పెంపు నిర్ణయాలను సోనియాగాంధీ పుట్టిన రోజు నుంచి అమల్లోకి తీసుకువస్తాం.
— తెలంగాణ మంత్రి, శ్రీధర్ బాబు… pic.twitter.com/yJfYzboMCr— Congress for Telangana (@Congress4TS) December 7, 2023
నిబంధనలు:
రేపటి నుంచీ తెలంగాణ మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. నిబంధనలు ఇవీ…#TSRTC #Women #Telangana #Congress #RevanthReddy pic.twitter.com/1c4YOTRwuv
— BBC News Telugu (@bbcnewstelugu) December 8, 2023
ALSO READ: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం