ICC Mens ODI World Cup 2023: మంగళవారం హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరిగిన పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక (PAK vs SL) మ్యాచ్ లో పాకిస్తాన్ విజయ కేతనాన్ని ఎగర వేసింది. దీంతో పాకిస్తాన్ వన్ డే వరల్డ్ కప్ 2023 లో వరుసగా రెండో విజయాన్ని దక్కించుకుంది.
బాంగ్లాదేశ్ : 344-9/ 50 ఓవర్లు
పాకిస్తాన్ : 345-4/ 48.2 ఓవర్లు ( విజేత )
మ్యాచ్ హైలైట్స్: (PAK VS SL HIGHLIGHTS)
ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాట్టింగ్ కు దిగిన శ్రీలంక 50 ఓవర్లు ముగిసే సమయానికి 344 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో కుశాల్ మెండిస్ మరియు సమరవిక్రమ సెంచరీ లతో మోత మోగించగా… నిశాంక 51 పరుగులతో శ్రీలంక ఇన్నింగ్స్ ను ముందుండి నడిపించారు.
అయితే లంక బ్యాట్సమెన్ లని కట్టడి చేయడంలో పాక్ బౌలర్లు కాస్త చతికిల పడ్డారు అని చెప్పాలి. పాక్ బౌలర్లలో హాసన్ అలీ 4 వికెట్లు, హరీష్ రాఫ్ 2 వికెట్లు తీయగా… ఆఫ్రిది, షాదాబ్ మరియు నవాజ్ లకు ఒక్కో వికెట్ దక్కాయి.
అనంతరం 345 పరుగుల లక్ష్యం తో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన పాక్… 48.2 ఓవెన్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ ఇమాం మరియు వన్ డౌన్ లో వచ్చిన పాక్ స్టార్ బ్యాట్సమెన్ బాబర్ విఫలం అయినప్పటికీ… అబ్దుల్లాహ్ మరియు రిజవాన్ శతకాలతో పాక్ కు విజయాన్ని అందించారు.
అయితే ప్రత్యర్థిని కట్టడి చేయడం లో శ్రీలంక పూర్తిగా విఫలం అయ్యింది. శ్రీలంక బౌలర్లలో మధు శంక కు 2 వికెట్లు దక్కగా… పతిరానా మరియు తీక్షణ ఒక్కో వికెట్ తీసుకున్నారు.
మ్యాన్ అఫ్ ది మ్యాచ్:
మహమ్మద్ రిజ్వన్ – 131 (121బంతుల్లో)
ALSO READ: ENG Vs BAN: వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ బోణి… 137 పరుగులతో బాంగ్లాదేశ్ పై విజయం