EcoMap CEO dead: అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. 26 ఏళ్ళ ఒక టెక్ కంపెనీ సీఈఓ పావా లాపెరి చిన్న వయసులోనే దారుణ హత్యకు గురైయ్యారు. సీఈఓ పావా లాపెరి హత్య వార్తతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మీడియా ఇచ్చిన సమాచారం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
అమెరికాలోని బాల్టిమోర్ ప్రాంతాల్లోని ఒక అపార్ట్మెంట్ లో ఎకోమ్యాప్ టెక్నాలజీస్ వ్యవస్థాపకురాలు, సీఈఓ పావా లాపెరి ఉంటున్నారు. అయితే లాపెరి తన ఫ్లాట్ నించి ఇంతకు బయటకు రాకపోవడంతో… సోమవారం ఉదయం తాను ఉంటున్న అపార్ట్మెంట్ నించి పోలీసులకి కాల్ వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే లాపెరి ఉంటుంది అపార్ట్మెంట్ కు చేరుకున్నారు.
అనంతరం పోలీసులు ఫ్లాట్ తలుపులు తెరిచి చూడగా తల మీద బలమైన గాయంతో లాపెరి పడిఉండడం గమనించారు. తలకు బలమైన గాయం తగలడంతోనే లాపెరి మరణించింది అని పోలీసులు గుర్తించారు.
లాపెరి మరణించడానికి జేసన్ డీన్ బిల్లింగ్స్లీ అనే వ్యక్తి కారణం అయ్యి ఉంటాడు అని పోలీసుల అనుమానం. జేసన్ డీన్ బిల్లింగ్స్లీ చాల ప్రమాదకరమైన వ్యక్తి. గతంలో అతను లింగిక కేసులో జైలుకెళ్లి తిరిగొచ్చాడు.
లాపెరితో జేసన్ కి ఎటువంటి సంబంధం లేనప్పటికీ… తన నేరప్రవృత్తిలో భాగంగా ఏమైనా హత్య చేసి ఉంటాడా అని పోలీసులు అనుమానిస్తున్నారు. జేసన్ కోసం పోలీసుల ముమ్మరంగా గాలించారు. అనంతరం అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం.
EcoMap Ceo Pava Lapere Dead:
It is with profound sadness and shock that EcoMap announces the passing of our CEO, Pava LaPere. We'll honor her legacy; please keep her family and loved ones in your thoughts and prayers. pic.twitter.com/W8PKWOCKt3
— EcoMap Technologies | The Ecosystem Company (@EcoMapTech) September 26, 2023
ALSO READ: ఇరాక్: పెళ్లి వేడుకలో అగ్ని ప్రమాదం…వంద మందికి పైగా మృతి