Asaduddin Owaisi Comments On Chandrababu: ఏపీలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్ట్ పై రెండు తెలుగు రాష్ట్రాల నాయకులు, భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తెలంగాణ ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ, టీడీపీ ఆదితేన చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవైసీ వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ అసలు అసదుద్దీన్ ఓవైసీ ఎం అన్నారు?
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీ ప్రముఖ నేతలతో సమావేశం అయ్యారు. రెండు రాష్ట్రాల్లోనూ పాలనా వ్యవహారాలు..పార్టీ విస్తరణ మరియు బలోపేతం పైన చేర్చించినటు సమాచారం. ఈ సమావేశంలో భాగంగా చంద్రబాబు అరెస్టుపై ప్రస్తావనరాగ… ఓవైసీ సంచల వ్యాఖ్యలు చేశారు.
జైల్లో చంద్రుడు హ్యాపీ:
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో అరెస్టై, రాజముండ్రి సెంట్రల్ జైలు లో రిమాండ్ లో ఉన్న చంద్రబాబుపై ఓవైసీ సంచలన కామెంట్స్ చేశారు. ఇంతేకాకుండా…చంద్రుడు ఏపీ జైల్లో హ్యాపీగా ఉన్నారని… ఆయన ఎందుకు జైలుకు వెళ్లారో కూడా అందిరకీ తెలుసని చురకలు వేశారు.
చంద్రబాబును మాత్రం ఎప్పటికి నమ్మలేనని… ప్రజలు కూడా ఆయనను నమ్మొద్దని ఓవైసీ పేర్కొన్నారు. అంతే కాకుండా ఏపీలో ఎం ఐ ఎం పని చేయాల్సిన అవసరం ఉందని… ఏపీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందన్నారు.
జగన్ పాలనా భేష్:
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు ఓవైసీ. ఏపీలో ప్రస్తుతం రెండు పార్టీలే ఉన్నాయి…ఒకటి టీడీపీ మరొకటి వైసీపీ అని పేర్కొన్నారు. అంతేకాకుండా రాష్ట్రానికి జగన్ మంచి పాలనా అందిస్తున్నారు అని అన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఓవైసీ వార్నింగ్:
ఇకపోతే ఎంఐఎం నేతలను వేధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకూ ఓవైసీ వార్నింగ్ ఇచ్చారు. తమ పార్టీ కార్యకర్తలను వేధించే ఎమ్మెల్యేలను గుర్తు పెట్టుకుంటామంటూ ఓవైసీ ప్రశంసించారు.
ALSO READ: ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు- నందమూరి బాలకృష్ణ