కాశ్మీర్‌లో జరిగిన యుద్ధ నేరాల ఆరోపనలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరియు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేలను అరెస్టు చేయాలని కోరుతూ లండన్‌కు చెందిన ఒక సంస్థ జనవరి 20, గురువారం UK ( United Kingdom) పోలీసులకు దరఖాస్తు చేసినట్లు AP ( అసోషిఏటెడ్ ప్రెస్) నివేదించిందని ది క్వి౦ట్ ఒక కధన౦లో రాసి౦ది.
ది క్వి౦ట్ కధన౦ ప్రకారం… సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు మరియు పౌరులను హింసించడం, కిడ్నాప్ చేయడం మరియు చంపడం వంటి వాటిని భారత మిలటరీ బలగాలు ఎలా నిర్వర్తిస్తాయో అనేదానికి సాక్ష్యాలను స్టోక్ వైట్ అనే లా స౦స్థ యూకే పోలీసులకు సమర్పి౦చి౦ది.
2020-21 మధ్యకాలంలో 2,000కు పైగా సాక్ష్యాలను కూడగట్టి, వాటి ఆధారంగా చేసుకుని నివేదికను రూపొందించినట్లు సంస్థ పేర్కొంది మరియు యుద్ధ నేరాలు మరియు చిత్రహింసలలో ఎనిమిది మంది సీనియర్ భారతీయ సైనికాధికారులకు ప్రత్యక్షంగా ప్రమేయం ఉ౦దని ఆరోపించింది.
“భారత అధికారులు జమ్మూ మరియు కాశ్మీర్‌లో పౌరులపై యుద్ధ నేరాలు మరియు ఇతర హింసను నిర్వహిస్తున్నారని నమ్మడానికి బలమైన కారణం ఉంది” అని AP నివేది౦చి౦ది.
విదేశీ వ్యవహారాలు, హోం మంత్రిత్వ శాఖ నో కామెంట్
AP నివేదిక ప్రకారం, విదేశాంగ మంత్రిత్వ శాఖ సదరు రిపోర్టు గురించి తమకు తెలియదని మరియు వ్యాఖ్యానించడానికి నిరాకరించింది.హోంమంత్రి కూడా ఈ నివేదికపై స్పందించలేదు.
ప్రపంచంలో ఎక్కడైనా మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులపై విచారణ జరిపేందుకు దేశాలకు అధికారాన్ని ఇచ్చే “యూనివర్సల్ జురిస్డిక్షన్” సూత్రం ప్రకారం న్యాయ సంస్థ దరఖాస్తును దాఖలు చేసిందని నివేదిక పేర్కొంది.
జెనీవా కన్వెన్షన్స్ యాక్ట్ 1957 ప్రకారం UK యుద్ధ నేరాలపై సార్వత్రిక అధికార పరిధిని కలిగి ఉంది.
With inputs from The Quint