కాంగ్రెస్ పార్టీ లో చేరిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లకార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో వైఎస్ షర్మిల వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో (YS Sharmila joins Congress Party) విలీనం చేశారు.
బుధవారం రాత్రి తన భర్త అనిల్ తోపాటు ఢిల్లీకు చేరుకున్న వైఎస్ షర్మిల… నేడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలవడం జరిగింది. అనంతరం మల్లిఖార్జున ఖర్గే మరియు రాహుల్ గాంధీ సమక్షంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరారు.
ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ… వైఎస్ఆర్టీపీ పార్టీని విలీనం చేయడం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు. మరియు వైఎస్సార్ జీవితమంతా కాంగ్రెస్ కోసం పనిచేశారు.. నేను కూడా మా నాన్న వైఎస్సార్ అడుగుజాడల్లో నడుస్తున్నాను అని తెలిపారు.
అంతేకాకుండా రాహుల్ గాంధీ నే భారత ప్రధానిగా చూడడమే తన కల అని… అందుకుగాను తాను మనస్ఫూర్తిగా పనిచేస్తానని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ లో చేరిన షర్మిల (YS Sharmila joins Congress Party):
Senior leader from Andhra Pradesh YS Sharmila ji joins the INC in the presence of Congress President Shri @kharge, Shri @RahulGandhi and General Secy (Org.) Shri @kcvenugopalmp at the AICC HQ in New Delhi. pic.twitter.com/LqMvqqqwCm
— Congress (@INCIndia) January 4, 2024
It was my father's dream to see Rahul Gandhi as the Prime minister of India – YS Sharmila
After merging YSRTP in Congress, I will work with every congress worker to fulfill my father's dream. pic.twitter.com/oqdR0Vhcoz
— Anshuman Sail Nehru (@AnshumanSail) January 4, 2024
కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్టీపీ) విలీనం.. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసినందుకు సంతోషంగా ఉంది.. వైఎస్సార్ జీవితమంతా కాంగ్రెస్ కోసం పనిచేశారు.. నేను మా నాన్న వైఎస్సార్ అడుగుజాడల్లో నడుస్తున్నాను-వైఎస్ షర్మిల#YSRTP #YSSharmila #Congress
— NTV Breaking News (@NTVJustIn) January 4, 2024
ALSO READ: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల!