ఏపీ లో ఎన్నికల వేళ తెలుగు దేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. సీనియర్ నేత యనమల కృష్ణుడు టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు (Yanamala Krishnudu resigns TDP).
టీడీపీ అధిష్టానం ఎన్నికల్లో పోటీ చేసేందుకు యనమల కృష్ణుడుకి టికెట్ ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన పార్టీని వీడినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ తన నిర్ణయాన్ని తెలిపారు. అంతేకాకుండా రేపు వైయస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్లు యనమల కృష్ణుడు పేర్కొన్నారు.
యనమల కృష్ణుడు మీడియా తో మాట్లాడుతూ… 42 సంవత్సరాలు టీడీపీ లో కొనసాగినప్పటికీ ఇవాళ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తన రాజీనామాకు అనేక కారణాలు ఉన్నాయని అన్నారు.
రాజకీయాల మీద ఆసిక్తితో తాను రాజకీయాలలోకి వచ్చానని… అప్పటినుంచి ప్రజాసేవలో కొనసాగడం… అయితే ఈ రోజున కొన్ని కారణాలవల్ల తనకి వచ్చిన అవకాశం తీసుకున్నారు అని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనకి పదవి ఇప్పిస్తామని హామీ ఇచ్చి తరువాత మనల్ని దూరం పెయ్టారు అని ఆయన అన్నారు.
టీడీపీకి బాయ్ బాయ్ (Yanamala Krishnudu resigns TDP):
టీడీపీకి భారీ షాక్..
మాజీమంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు టిడిపికి రాజీనామా..
తుని సీటు విషయంపై అన్నదమ్ముల మధ్య కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న.. యనమల కృష్ణుడు
రేపు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్లు యనమల కృష్ణుడు తెలిపారు.@JaiTDP… pic.twitter.com/zQBEVsPiMq
— Telangana Awaaz (@telanganaawaaz) April 26, 2024
ALSO READ: సీఎం జగన్ పై షర్మిల ఫైర్