Taliban Leader Sher Mohammad Abbas Stanikzai once trained at Indian Military Academy.
తాలిబన్లలో ఏడుగురు అత్యంత శక్తివంతమైన వ్యక్తులలో ఒకరైన షేర్ మహ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్ ఒకప్పుడు ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లోని ప్రతిష్టాత్మక ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA) లో క్యాడెట్ అని ప్రముఖ న్యూస్ పోర్టల్ DNA ప్రచురి౦చి౦ది.
ఆఫ్ఘనిస్తాన్ గత తాలిబాన్ పాలనలో డిప్యూటీ విదేశాంగ మంత్రిగా పనిచేసిన స్టానిక్జాయ్, తన తోటివారికి భిన్నంగా, ఉన్నత విద్యావంతులుగా పరిగణి౦చబడ్డారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ఇ౦డియన్ మిలటరీ అకాడమీ యొక్క 1982 బ్యాచ్‌మేట్‌లలో స్టానిక్‌జాయ్‌ను ‘షేరు’ అని పిలిచేవారు అని DNA News Portal తెలిపి౦ది.
మహ్మద్ అబ్బాస్ స్టానిక్జాయ్, IMA లో భగత్ బెటాలియన్ కెరెన్ కంపెనీ యొక్క 45 మంది క్యాడెట్లలో ఒకడిగా ఉ౦డేనాటికి అతని వయస్సు 20 సంవత్సరాలు. అతను 1970 లలో ఇండో-ఆఫ్ఘన్ రక్షణ సహకార కార్యక్రమం కింద అధికారుల అకాడమీలో శిక్షణ పొందాడు అని తెలుస్తో౦ది.