ప్రముఖ టాలీవుడ్ నటి హంసానందిని క్యాన్సర్ బారిన పడినట్లు తన ఇన్స్టాగ్రామ్ అకౌ౦ట్లో తెలిపారు. తను బ్రెస్ట్ క్యాన్సర్ డి-3తో బాధపుడుతున్నట్లు ఓ సుదీర్ఘ పోస్టు పెట్టారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో గుండుతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ‘నాకు బ్రెస్ట్ క్యాన్సర్. గ్రేడ్-3తో బాధపడుతున్నాను, ప్రస్తుతం కీమో థెరపీ చికిత్స తీసుకుంటున్నాను’ అని చెప్పారు.
చాలామ౦ది నేను ఈ మద్య సినిమాల్లో, స౦బ౦దిత కార్యక్రమాల్లో కనిపి౦చట్లేదని మెసేజులు చేస్తున్నారు… మీ ప్రేమకు, అభిమానానికి దన్యవాదాలు. నేను అసాధారణమైన వైద్యుల బృందం సంరక్షణలో ఉన్నానని మీకు హామీ ఇస్తున్నాను. ఇది కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు సినీ ప్రముఖుల హద్దులేని మద్దతుతో పాటు, నేను దట్టమైన సానుకూలత మరియు కృతజ్ఞతతో ఉత్సాహంగా పోరాడుతున్నాను.
అంతేగాక క్యాన్సర్‌ను జయించి పూర్తి ఆరోగ్యంతో తిరిగి సినిమాల్లో నటిస్తానంటూ ఆమె ధీమా వ్యక్తం చేసారు.
కాగా ఆర్యన్ రాజేశ్ హీరోగా వచ్చిన ‘అనుమానస్పదం’ సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన స౦గతి తెలిసి౦దే.