తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలులోకి వచ్చిన విష్యం తెలిసినదే. ఈ పథకం అమలుతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని… తమకు న్యాయం చేయాలనీ కోరుతూ ఈ నెల 16న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు బంద్ కు (Telangana Auto Bandh planned for February 16th) పిలుపునిచ్చినట్లుగా తెలుస్తోంది.
ఈ బంద్ (Telangana Auto Bandh) ను విజయవంతం చేయాలని (టీఏటీయూ) ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య (Vemula Maraiah) కోరారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో కల్పించడంతో ఆటో డ్రైవర్ లు ఆటో డ్రైవర్ ఆత్మహత్యలు చేసుకుంటుంటే… ప్రభుత్వం మాత్రం ఏ విధంగా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమకు తక్షణమే న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేసినట్లు సమాచారం.
ALSO READ: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై కే.ఏ.పాల్ ఫైర్