మెదక్ ఎ౦పీ టికెట్ ను తనకు కేటాయి౦చాలని తెల౦గాణా ఉద్యమకారుడు, BRS సీనియర్ నాయకులు శ్రీ బీరయ్య యాదవ్ ( Shri Beeraiah Yadav), పార్టీ జాతీయ అద్యక్షులు శ్రీ కల్వకు౦ట్ల చ౦ద్రశేఖర్ రావుకు లేఖ రాసారు.
మలిదశ తెలంగాణ ఉద్యమం తొలినాటి నుంచి దాదాపు 24 సంవత్సరాలుగా నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలాగే తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం ఉమ్మడి మెదక్ జిల్లా అంతట అవిశ్రాంతంగా పనిచేయడం జరిగింది అని లేఖలో పేర్కొన్నారు.
అనేక పోలీస్ కేసులు లాఠీ దెబ్బలు చివరకు ఆఖరికి మరి జైలు కూడా వెళ్లడం జరిగింది. ఆనాడు నుండి నేటి వరకు నేను మరి ఎలాంటి పార్టీ నుంచి పదవులు గాని మరి ఆర్థికంగా ప్రయోజనాలను గాని పొందలేదు అనే విషయాన్ని గుర్తుచేస్తు లేఖలో ప్రస్తావి౦చారు.
జనవరి 19 నాడు జరిగిన మెదక్ పార్లమెంటరీ సమావేశంలో BRS అధినేత కేసీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని అలాగే మాజీ మంత్రి హరీష్ రావు గారిని కలిసి లేఖ ఇవ్వడ౦ జరిగి౦దని అవాజ్ 24 తెలుగు ప్రతినిధితో చెప్పారు.
ఈ సందర్భంగా బీరయ్య యాదవ్ మాట్లాడుతూ ఏడు అసెంబ్లీ నియోజకవర్గ అన్ని వర్గాల ప్రజలతో విస్తృతమైన సంబంధాలు ఉన్నాయని కేసీఆర్ గారి ఆశిశ్శులతో గతంలో BRS రాష్ట్ర కార్యదర్శిగా, వివిధ ఎన్నికల్లో పలు జిల్లాల, మండల ఇంచార్జ్ గా పని చేశానని అన్నారు. జిల్లాలో నాకు తెలంగాణ ఉద్యమకారుడిగా బీసి నేతగా ప్రజల్లో మంచి గుర్తింపు ఉందని, తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కుర్మల జనాభా సంఖ్య దాదాపు 50 లక్షల వరకు ఉందని, ఈ వర్గాల ప్రతినిధిగ నాకు అవకాశం కల్పించాలని పార్టీ అదిష్టానాన్ని, అదే విదంగా జిల్లాలోని MLA లను కోరడ౦ జరిగి౦దని తెలిపారు.
మెదక్ ప్రజలు, నాయకులతో సత్సంభందాలు ఉండడంతో పార్టీకి విధేయుడిగా ఉన్న తనకు మెదక్ ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందిగా అధినేత కేసీఆర్ ను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ నాయకుడు ఉస్మాన్ అలీ, విద్యార్థి నాయకుడు అఖిల్, యువజన నాయకుడు నరేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.