తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే… రాష్ట్ర మహిళలకు TSRTC బస్సులలో ఉచిత బస్సు సదుపాయం కల్పించడం జరిగింది. అయితే TSRTC బస్సులలో ఉచితంగా ప్రయాణించే మహిళలందరూ తప్పనిసరిగా జీరో టికెట్ తీసుకోవాలి అని TSRTC VC & MD సజ్జనార్ తెలిపారు. ఒకవేళ జీరో టికెట్ తీసుకోకుండా బస్సులో ప్రయాణించిన యడల సదరు మహిళలకు రూ.500 జరిమానా విధించనున్నట్లు (Rs 500 fine for not taking Zero Ticket) సజ్జనార్ హెచ్చరించారు.
అంతేకాకుండా… జీరో టికెట్ ల ఆధారం గానే రాష్ట్ర ప్రభుతం ఆ డబ్బు మొత్తాన్ని రీఎంబర్స్మెంట్ చేస్తున్నది. జీరో టికెట్ తీసుకోకుండా ప్రయాణించడం ద్వారా సంస్థకు నష్టం చేకూర్చిన వారవుతారని తెలిపారు.
ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ విధిగా టికెట్ తీసుకుని సహకరించాలని అని సజ్జనార్ కోరారు.
రూ.500 జరిమానా (Rs 500 Fine for not taking Zero Ticket):
మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి! "మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకం" వినియోగించుకోవాలంటే ఒరిజినల్ గుర్తింపు కార్డు తప్పనిసరి. గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫొటో, అడ్రస్ స్పష్టంగా కనిపించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ఏ ఒరిజినల్ గుర్తింపు కార్డైన ఈ… pic.twitter.com/7WGyTPfqDE
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) January 8, 2024
ALSO READ: హైదరాబాద్ లో ఫార్ములా-ఈ రేసు రద్దు