ముంబై ఇండియన్స్ ఫాన్స్ కు హార్ట్ బ్రేకింగ్. ముంబై ఇండియన్స్ పదేళ్లు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ ని తప్పిస్తూ(Rohit Sharma stepped down as Mumbai Captain) కొత్త కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య కు పగ్గాలు అప్పగించింది జట్టు మేనేజ్‌మెంట్. ఈ విషయాన్నీ ముంబై జట్టు మేనేజ్‌మెంట్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.
ఐపీఎల్ 2024 సీజన్‌లో హార్దిక్ సారథ్యంలో (Hardik Pandya Mumbai Captain) ముంబై ఇండియన్స్ బరిలోకి దిగనుంది అన్న విషయాన్నీ జట్టు మేనేజ్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది. ఇందుకుగాను కొత్తగా నియమితమైన కెప్టెన్ హార్దిక్ పాండ్య కు అభినందనలు తెలుపుతూ… జట్టు ఇంతకాలం సేవలందించిన రోహిత్ ను కొనియాడింది.
ముంబై జట్టుకు ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీని అందించిన కెప్టెన్ రోహిత్ శర్మను తీసేయడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే రోహిత్ శర్మ తానే కెప్టెన్సీ ని వదిలేసాడా? లేదా జట్టు మేనేజ్‌మెంట్ అతడిని తొలగించిందా? అన్న ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియా లో చర్చనీయాంశంగా మారింది.
రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ 2013, 2015, 2017, 2019, 2020 ఇలా ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్స్ గెలుచుకున్న విషయం తెలిసినదే. ముంబై తరపున 163 మ్యాచ్ లకు కెప్టెన్గా వ్యవహరించిన రోహిత్ శర్మ 91 మ్యాచ్ లో జట్టుకు విజయాన్ని అందించాడు. కాగా మరో 68 మ్యాచులో జట్టు ఓటమి పాలయింది. అంతేకాకుండా రోహిత్ కెప్టెన్సీలో విజయాల శాతం 55.06 ఉండడం గమనార్హం.
రోహిత్ శర్మ పదేళ్ల ముంబై జట్టు కెప్టెన్సీ ప్రయాణానికి అనూహ్యంగా తెరపడింది. మరీ విషయం పై రోహిత్ మరియు ముంబై జట్టు మేనేజ్‌మెంట్ ఎలా స్పందిస్తుందో వేచి ఉండాల్సిందే.
Rohit Sharma stepped down as Mumbai Captain:
Rohit Sharma as a captain in the IPL:
Matches – 158
Won – 87
Lost – 67
Tied – 4He came when Mumbai Indians had 0 IPL titles and he is stepping down as captain of Mumbai Indians when they are having 5 IPL titles. pic.twitter.com/xUaL1f7gjf
— Johns. (@CricCrazyJohns) December 15, 2023
Hardik Pandya New Mumbai Captain:
To new beginnings. Good luck, #CaptainPandya 💙 pic.twitter.com/qRH9ABz1PY
— Mumbai Indians (@mipaltan) December 15, 2023